ఈ రోజుల్లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా అధిక కొలెస్ట్రాల్ తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికి కారణం తినే ఆహారం మీద అవగాహన లేకపోవడం అని చెప్పచ్చు ఈమధ్య కాలంలో చాలామంది ఎక్కువగా మటన్ తీసుకుంటున్నారు. మద్యం తీసుకుంటున్నారు. వీటి కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. చలికాలంలో వ్యాయామం చేయకపోవడం కూడా ఒక కారణం. శరీరం విటమిన్ డి లోపిస్తూ ఉంటుంది. ఇది లిపిడ్ జీవక్రియని ప్రభావం చేస్తుంది.
Advertisement
Advertisement
చలికాలంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి ఆహారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి శీతాకాలంలో వీటిని తీసుకుంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పీచు పదార్థాలను తీసుకుంటూ ఉండండి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటే మంచిది. అత్తిపళ్ళు, వాల్నట్స్ వంటివి తీసుకోండి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. బీట్రూట్ ముల్లంగి పాలకూర వంటివి తెలుసుకోండి. బ్రోకలీ దుంపలు క్యారెట్లు వంటివి కూడా తీసుకోండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!