గిన్నెలో పాలు పెట్టి వేరే పనిలో కాస్త తలమునకలవ్వగానే గిన్నెలో పెట్టిన పాలు పొంగి గ్యాస్ పొయ్యంతా పాడయిన సందర్భాలు అనేకం కదా! అయితే ఇప్పుడు ఒక చిన్న చిట్కాతో గిన్నెలోని పాలు పొంగకుండా ఉండేలా చేద్దాం! పాల గిన్నెపై ఒక చెక్క గరిటెను పెడితే చాలు పాలు పొంగవు. ఎంత పెద్ద మంట పెట్టినా అక్కడి వరకే వచ్చి ఆగిపోతాయి.
Advertisement
Advertisement
దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే?
కింద మంట పెట్టినప్పుడు పాలు ఒక పొరగా పైకి వస్తుంది. అలా వచ్చిన పొర గరిటెను తాకగానే ఆవిరితో కూడిన ఆ పొర పగిలిపోతుంది. చెక్క త్వరగా ఉష్ణాన్ని గ్రహించదు కాబట్టి అది త్వరగా వేడెక్కదు. అందకే పాలు అక్కడి వరకు వచ్చి ఆగిపోతాయి!
Video:
Ailaaa!! Should have known this years ago… the number of times my mom shouted at me for spilling the milk🤦♂️ https://t.co/uqxP0XFRne
— Sujit (@cynicalbabu) November 11, 2021