Home » హార్ట్ ఎటాక్ వస్తే… CPR ఎలా చేయాలి? ఇవే నియమాలు కచ్చితంగా తెలుసుకోండి.

హార్ట్ ఎటాక్ వస్తే… CPR ఎలా చేయాలి? ఇవే నియమాలు కచ్చితంగా తెలుసుకోండి.

by Bunty
Ad

 

కార్డియాక్ అరెస్ట్ అంటే ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం. అంటే గుండె పనితీరు పూర్తిగా తగ్గిపోవడం లేదా 200 కంటే ఎక్కువగా కొట్టుకొని సడన్ గా ఆగిపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ఇలా ఆకస్మాత్తుగా వ్యక్తికి కార్డియాక్ అరెస్టు సంభవించినప్పుడు సిపిఆర్ చేసి బతికించుకోవచ్చు. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరి రిససిటేషన్. గుండె ఆగిపోయిన వ్యక్తికి వెంటనే నేలపై వెళ్ళకిలా పడకోబెట్టి గుండె పై భాగంలో పంపింగ్ చేస్తూ, అదే సమయంలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ అందేలా చేయాలి. అంటే నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందించాలి. అయితే ఇప్పుడు సిపిఆర్ చేయడం ఎలానో చూద్దాం.

READ ALSO : వెయిటింగ్ లిస్టులో ఉన్న రైల్వే టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయండి…?

Advertisement

సిపిఆర్ చేయడం ఎలా?

గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తిని బహిరంగ ప్రదేశంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాలి.
రెండు చేతులతో చాతి మధ్యలో బలంగా నొక్కాలి. ఇలా 30 సార్లు కంటిన్యూగా చేయాలి.
మధ్యలో పడిపోయిన వ్యక్తి నోటిలో నోరు పెట్టి గాలి ఊదాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేయాలి. నోటితో చేయలేనివారు పేపర్ ని పైపుల చుట్టి గాలి ఊదాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు స్టీమ్యూలేట్ అయ్యి ఊపిరి ఆడడం మొదలవుతుంది.

Advertisement

READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?


అప్పటికి ఊపిరి అందకపోతే రోగి రెండు కాళ్ళని నిటారుగా లేపాలి. ఇలా చేయడం వల్ల శరీరం దిగువ భాగంలో ఉన్న రక్తం తిరిగి గుండెకు చేరుకోవడం ద్వారా గుండె పని చేసే అవకాశం ఉంటుంది. గుండె కొట్టుకోవడం మొదలైన తర్వాత పల్స్ చెక్ చేయాలి. పల్స్ వాల్యూమ్ బాగుందా లేదా పల్స్ క్రమంగా వస్తుందా ఇర్రేగ్యులర్ గా వస్తుందా అనేది చెక్ చేయాలి.
ఈలోపు అంబులెన్స్ కి కాల్ చేయమని చెప్పడమో, కాల్ చేయడమో చేస్తే సిపిఆర్ పూర్తయ్యే లోపు అంబులెన్స్ వస్తుంది.
సిపిఆర్ చేయడం వల్ల చాలామంది తిరిగి బతికారు.
పిల్లలకు, పురుషులకు కూడా ఇదే పద్ధతి. కానీ పిల్లలకు చాతి మధ్యలో ఒక చేతితోనే నొక్కాలి. శిశువుకి రెండు వేళ్ళతో మాత్రమే మెల్లగా నోక్కుతూ ఉండాలి. సిపిఆర్ చేయడం వల్ల ఆగిపోయిన శరీర భాగాలకు, మెదడుకు తిరిగి రక్త సరాఫరా జరుగుతుంది.

READ ALSO : Niharika konidela : నిహారిక పనుల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు

Visitors Are Also Reading