ఎండాకాలం ఎండలు పెరిగిపోయాయి. ఏ మామిడి చెట్టు చూసిన నిండుగా కాసిన మామిడికాయలతో విరాజిల్లుతోంది. ఆకుల సందుల్లోంచి తొంగి చూస్తున్న మామిడికాయలు పచ్చడి చేయడం కోసం నీళ్ళురుతున్నాయి. అలాంటి ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం..
ఆవకాయ పచ్చడి:
నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలను తీసుకొని, రెండు కప్పుల నూనె, ఆవపిండి ఒక కప్పు, మిరప్పొడి ఒక కప్పు, ఉప్పు తగినంత, అలాగే మెంతి పొడి అర కప్పు, వెల్లుల్లి రేఖలు అరగప్పు, ఆవాలు పావు కప్పు తీసుకోవాలి.
Advertisement
Also Read:New Railway Rules:కొత్త రైల్వే రూల్స్.. ఇక అలా కూర్చోవడం కుదరదు..!!
తయారీ విధానం:
మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత సోన పోవడానికి తొడిమెలు తొలగించాలి. ఆ తర్వాత టెంకతో సహా ముక్కలను కోయాలి. మీడియం సైజు కాయను 12 ముక్కలుగా చేయవచ్చు. ఈ టెంకలోని గింజలను తొలగించి టెంకకు గింజకు మధ్య ఉండే పొరను కూడా తీసేసి ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి. వెడల్పు పాత్ర తీసుకొని తేమ లేకుండా శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ఆ తర్వాత ఆ పాత్రలో మిరప్పొడి,ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేకలు కలపాలి.
Advertisement
Also Read:సమంత నాగచైతన్య విడాకుల వల్ల ఆ దోషం పట్టుకుందా.. అందుకే వరుస ఫ్లాపులు వస్తున్నాయా..?
ఆవపిండి కారంలో ఉప్పు చూసుకొని రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి అవి వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. నూనె చల్లార్చిన తర్వాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జాడీలో నింపాలి. దీని తర్వాత ఆవకాయపై నూనె తేలుతూ ఉండాలి. ఇలా చేస్తే అద్భుతమైన రుచితో ఆవకాయ పచ్చడి తయారైనట్టే.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో సోను సూద్ కొత్త పార్టీ..పవన్ తో పొత్తు ఉంటుందా ..?