Home » మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలా..? ఇలా చేయండి..!

మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలా..? ఇలా చేయండి..!

by Sravya
Ad

ఈరోజుల్లో జరిగే మోసాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈరోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ పెరగడంతో, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది సైబర్ నేరాల మాయలో పడి డబ్బులు ని కోల్పోతున్నారు. చాలామంది రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విజయవాడకి చెందిన ఒకే అతని పేరు మీద 658 సిమ్ కార్డులు యాక్టివేట్ లో ఉన్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుస్తోంది. అయితే నిజానికి ఒక వ్యక్తికి 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉండకూడదట.

Advertisement

టెలి కమ్యూనికేషన్ శాఖ తాజాగా సిమ్ కార్డులు పై లిమిట్ ని విధించింది. ఒక వినియోగదారుడు పేరు మీద 9 కంటే సిమ్ కార్డులు ఉన్నట్లయితే, వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది. అదనపు కనెక్షన్లన్నీ డియాక్టివేట్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు డాట్ సూచించింది. ఇక ఎలా ఒకరి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలి అనేది చూసేద్దాం.

Advertisement

ఇందుకు మొదట మీరు సంచార్ సాతి అధికారిక వెబ్‌సైట్ https://sancharsaathi.gov.in/ ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోండి అనేది నొక్కండి. కొత్త పేజీ వస్తుంది. 10 అంకెల మొబైల్ నెంబర్ ఇచ్చేసి, క్యాప్చా కోడ్‌ ని కూడా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుస్తుంది.

Also read:

Visitors Are Also Reading