Home » వానాకాలంలో మొక్కలు బాగుండాలంటే… ఈ తప్పులు చేయకండి..!

వానాకాలంలో మొక్కలు బాగుండాలంటే… ఈ తప్పులు చేయకండి..!

by Sravya
Ad

వానా కాలంలో మొక్కలు పాడైపోతాయి. వానా కాలంలో మొక్కలు బాగా ఎదగాలంటే ఇలా చేయండి. ఈ రోజుల్లో చాలామంది మొక్కల మీద ఆసక్తి ని పెంచుకుంటున్నారు అపార్ట్మెంట్లలో బాల్కనీలో కూడా పెంచుతున్నారు. మిద్దె తోటలని మేడ మీద కూడా మొక్కలని పెంచుతున్నారు. వానా కాలంలో కొన్ని మొక్కలు ఆకులు, పువ్వులు వాడిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. అయితే వానా కాలంలో మొక్కలు బాగుండాలంటే ఇటువంటి వాటిని తొలగించాలి లేదంటే ఆ తేమకి అక్కడ క్రిమి కీటకాలు మొక్క అంతా వ్యాపించి మొక్కలు దెబ్బ తినేలా చేస్తాయి. వానా కాలంలో వీచే బలమైన ఈదురు గాలులకి పొడవాటి మొక్కలు చెట్లు వంగిపోతూ ఉంటాయి.

plants

Advertisement

Advertisement

దీని వలన మొక్క పాడవుతుంది అలా కాకుండా మొక్కకి సపోర్ట్ ని ఇవ్వాలి. గార్డెన్ ఉన్న వాళ్ళు నీళ్లు ఎక్కువ పోయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే గార్డెన్ చివర్లో నీళ్లు పోయేలా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో పెంచుకునే ఆకుకూరలు, పువ్వులు వర్షపు చినుకులు గాలి వలన డామేజ్ అవుతాయి. రెయిన్ ప్రూఫ్ కవర్ని వేస్తే ఆ సమస్య ఉండదు మొక్కలకి నీళ్లు పెడితే చాలదు. ఎరువులు కూడా వేయాలి. కాయగూరల వ్యర్ధాలు, కాఫీ పిప్పి వంటివి వేస్తే మంచిది. ఎక్కువ వర్షం పడడం వలన కుండీల్లో మట్టి తొలగిపోయి ఒక్కోసారి వాటి వేర్లు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మట్టితో వాటిని కప్పి ఎరువులు వేయాలి ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే వానా కాలంలో మొక్కలు బాగుంటాయి.

Also read:

Visitors Are Also Reading