Home » సిగ‌రెట్లు తాగితే ఏం జ‌రుగుతుంది..భ‌యంక‌ర‌మైన నిజాలు..!

సిగ‌రెట్లు తాగితే ఏం జ‌రుగుతుంది..భ‌యంక‌ర‌మైన నిజాలు..!

by AJAY
Published: Last Updated on
Ad

పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం…ఇది అంద‌రికీ తెలిసిందే. కానీ పొగ‌తాగ‌టం ఎందుకు హానిక‌రం…ఇది మ‌న‌దేహం ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది అనేది మాత్రం తెలియ‌దు. నిజానికి పొగ‌తాగ‌డం వ‌ల్ల ఆ ప్ర‌భావం ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా చూపుతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం….పొగ‌తాగ‌డం వ‌ల్ల థార్ అనే న‌ల్ల‌ని ప‌ధార్థం నోట్లోకి వెళుతుంది. అది దంతాల ఎనామిల్ ను దెబ్బ తీస్తుంది. అంతే కాకుండా దంతాల‌పై న‌ల్ల‌ని పొర‌మాదిగా ఏర్పడుతుంది. అంతే కాకుండా పొగ‌తాగ‌టం వ‌ల్ల ముక్కులో ఉండే న‌రాలు కూడా దెబ్బతింటాయి. దాంతో ముక్కు వాస‌న చూసే గుణాన్ని కూడా కోల్పోతుంది. సిగ‌రెట్ తాగ‌టం వ‌ల్ల ఊపిరితిత్తుల‌పై కూడా ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పొగ ఊపిరితిత్తుల మ‌ధ్య‌లోకి వెళ్లి ఇన్ఫెక్ష‌న్ ల‌ను పెంచుతుంది.

How smoking effects

How smoking effects

దాంతో బ్రోన్ చిట్స్ మ‌రియు ఎంపిసెమా అనే ఊపిరితిత్తుల వ్యాధులు కూడా వ‌స్తాయి. అంతే కాకుండా ఊపిరి తిత్తుల్లో ఉండే టైనీ అనే వెంట్రుక‌ల్లాంటి నిర్మాణాల‌ను నాశ‌నం చేస్తాయి. ఈ నిర్మాణాలు మనం పీల్చుకునే గాలిని శుభ్ర‌ప‌రుస్తాయి. ఇవి క్షీణించడం వ‌ల్ల ఊపిరితిత్తుల ప‌నితీరు పాడైపోయే ప్ర‌మాదం ఉంది. టైనీ పాడై పోవ‌డం వ‌ల్ల విష‌పూరిత‌మైన కార్బ‌న్ మోనాక్సైడ్ ర‌క్తంలోకి చేరుతుంది. అది ర‌క్తం ద్వారా శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌కు చేరుతుంది. అందువ‌ల్ల శ‌రీరంలో ఆక్సీజ‌న్ స్థాయి ప‌డిపోతుంది. దాంతో నీర‌సం…ఊపిరితీసుకోవ‌డంలో ఇబ్బందులు రావ‌డం జ‌రుగుతుంది. సిగ‌రెట్ తాగిన ప‌ది సెకెండ్ల‌లోనే నికోటిన్ మొద‌డును చేరుతుంది.

Advertisement

Advertisement

Also Read: పుట్టబోయేది అబ్బాయో- అమ్మాయో ఇలా తెలుసుకోవచ్చట

దాంతో డోప‌మైన్ విడుద‌ల అవుతుంది. ఎక్కువ సిగ‌రెట్లు తాగే వారిలో డోప‌మైన్ అధికంగా విడుద‌లై శ‌రీరంపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సిగ‌రెట్ నుండి శ‌రీరంలోకి వెళ్లే నికోటిన్ మ‌రియు ఇత‌ర కెమికల్స్ ర‌క్త‌క‌ణాల‌ను దెబ్బ‌తీస్తాయి. దాంతో ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌లో అంత‌రాయం ఏర్ప‌డుతుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌లో అంత‌రాయం వ‌ల్ల ర‌క్తం స‌ర‌ఫ‌రా అయ్యే వాల్స్ ఉబ్బిపోతాయి. దాంతో ర‌క్త‌క‌ణాల‌పై ప్ర‌భావం పెరిగి హార్ట్ ఎటాక్ లు వ‌స్తాయి. అంతే కాకుండా సిగ‌రెట్ తాగ‌టం వ‌ల్ల డీఎన్ఏ లో మార్పులు జ‌రిగి క్యాన్స‌ర్ లు వ‌స్తుంటాయి. కాబ‌ట్టి పొగ‌తాగ‌టం ఆరోగ్యానికి హానిక‌రం….ఒక‌వేళ సిగ‌రెట్ కొంత కాలం తాగినా ఆ త‌ర‌వాత మానేస్తే మ‌ళ్లీ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Also Read: రెండవ ప్రపంచ యుద్ద సమయంలో పెళ్లి పత్రికను ఎప్పుడైనా చూశారా

Visitors Are Also Reading