Home » కేజీఎఫ్-2 విల‌న్ క్యాన్స‌ర్ ను ఎలా ఢీ కొట్టాడు…?

కేజీఎఫ్-2 విల‌న్ క్యాన్స‌ర్ ను ఎలా ఢీ కొట్టాడు…?

by AJAY
Ad

ఒక‌ప్ప‌టి బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సంజ‌య్ ద‌త్ ప్ర‌స్తుతం సినిమాల‌లో ముఖ్య‌మైన పాత్ర‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా వ‌చ్చిన కేజీఎఫ్ 2 సినిమాలో సంజ‌య్ ద‌త్ విల‌న్ గా న‌టించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక‌ముందు సంజయ్ ద‌త్ క్యాన్స‌ర్ భారిన‌పడిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దాంతో అంతా కంగారు ప‌డిపోయారు. కానీ సంజ‌య్ ద‌త్ క్యాన్స‌ర్ ను ఢీ కొట్టి దానిపై విజ‌యం సాధించారు. తాజాగా సంజ‌య్ ద‌త్ క్యాన్సర్ ను ఎలా జ‌యించాడు.

Advertisement

ఆ స‌మ‌యంలో త‌న అనుభ‌వాలు ఏంటి అన్న విషయాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం….మొద‌ట త‌న‌కు క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని తెలియ‌గానే రెండు గంట‌ల‌పాటు ఏడ్చేశాన‌ని చెప్పారు. త‌న కుంటుంబం గుర్తుకు వ‌చ్చిందని ఇప్పుడు వాళ్ల ప‌రిస్థితి ఏంట‌ని బాధ‌ప‌డ్డాన‌ని చెప్పారు. ఆ త‌ర‌వాత త‌న‌కు తానే ధైర్యం చెప్పుకున్నాన‌ని అన్నారు. మొద‌ట త‌న‌కు మెట్లు ఎక్కుతున్న స‌మ‌యంలో ఎక్కువ ఆయాసం వ‌చ్చింద‌ని చెప్పారు.

Advertisement

ఆ త‌ర‌వాత స్నానం చేస్తున్న‌ప్పుడు కూడా ఎక్కువ‌గా ఆయాసం రావ‌డం మొద‌లైంద‌ని చెప్పారు. దాంతో వెంట‌నే డాక్ట‌ర్ కు ఫోన్ చేశాన‌ని అన్నారు. టెస్టులు చేయించుకోగా ఊపిరితిత్తులు స‌గ భాగం నీటితో నిండాయ‌ని రిపోర్ట్ వ‌చ్చింద‌ని అన్నారు. మొద‌ట దాన్ని టీబీ అనుకున్నామ‌ని అన్నారు. కానీ ఆ త‌ర‌వాత అది క్యాన్స‌ర్ అని తెలియ‌డంతో బ‌య‌ప‌డిన‌ట్టు తెలిపారు.

విదేశాల‌కు వెళ్లి చికిత్స తీసుకోవాల‌ని అనుకున్న‌ట్టు చెప్పారు. కానీ వీసా రాక‌పోవ‌డంతో అది కుద‌ర‌లేద‌ని ఇక్క‌డే ఓ డాక్ట‌ర్ ను క‌లిసాన‌ని చెప్పారు. ఆ డాక్ట‌ర్ కీమో థెర‌పీ వ‌ల్ల వ‌చ్చే దుష్ప్ర‌భావాల‌ను చెప్పార‌ని అదే విధంగా ధైర్యం కూడా చెప్పార‌ని అన్నారు. తాను ప్ర‌తి రోజూ రెండు మూడు గంట‌లు ష‌టిల్ ఆడాన‌ని అంతే కాకుండా సైకిల్ తొక్క‌డం లాంటివి చేస్తూ మ‌నోధైర్యంతో క్యాన్స‌ర్ ను ఎద‌రుకున్నాన‌ని తెలిపారు.

Visitors Are Also Reading