జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నటువంటి నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను చూడడానికి రెండున్నర అడుగులే ఉన్నప్పటికీ ఇతని డైలాగులు, పంచులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే నరేష్ తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
Advertisement
చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. ఇతను పెద్దగా చదువుకోలేదు. చదువును మధ్యలోనే ఆపేసి నటనపై ఉన్న ఆసక్తితో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి… ఒక ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన తన ప్రయాణం టీం లీడర్ స్థాయి వరకు ఎదిగింది.
అంతటితో ఆగకుండా సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నాడు నరేష్. అయితే, చిన్నపిల్లడిలా కనిపించే నరేష్ వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలు. హైట్ తక్కువగా ఉండడంతో చిన్న పిల్లాడిలాగా కనిపిస్తాడు. నరేష్ కి వివాహం జరిగిందంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వాటిని నిజం కాదని కొంతమంది కొట్టి పారేశారు. కానీ, నరేష్ నిజ జీవితంలో వివాహం జరిగిందట.అయితే నరేష్ 2017లో తిరుపతాంబిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడట.
Advertisement
అలా కొంతకాలం పాటు వీరు చాలా సంతోషంగా గడిపారు. అయితే ఏమైందో తెలియదు కానీ నరేష్ భార్య ఆ**త్య చేసుకున్నారట. నరేష్ కన్నా ఆమె భార్య వయసు ఎక్కువ అని ప్రచారం. తన భార్య చనిపోయినప్పటి నుంచి నరేష్ సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే నరేష్ పెళ్లి విషయంలో అసలు వాస్తవం ఎవరికీ తెలియదు. ఇదంతా వట్టి ప్రచారమే అని టాక్. కాగా, జబర్దస్త్ షోలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంకా పలు షోలలో నటిస్తూ బిజీగా ఉన్నారు నరేష్.
ఇవి కూడా చదవండి
Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?
రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకో తెలుసా…!
చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడతారు… ఎందుకంటే….?