చాలామంది రోజు మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారం తీసుకోకపోతే వాళ్లకి తిన్నట్టే ఉండదు. మాంసాహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదే కానీ రోజు మాంసాహారాన్ని తీసుకుంటే మాత్రం ప్రమాదమే. రోజు మాంసాహారాన్ని తీసుకునే వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. రోజు నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంత ప్రమాదంలో పడుతున్నారో తెలుసుకోవాలి. తాజా అధ్యయనం ప్రకారం రోజు మాంసాహారం తీసుకుంటే గుండెజబ్బులు మధుమేహం వంటి సమస్యలు కలుగుతాయని తెలుస్తోంది. వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మాంసం చికెన్ టర్కీ లేదంటే పౌల్ట్రీ తీసుకుంటే అనారోగ్య సమస్యల ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
రెడ్ మీట్ ని ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే స్టమక్ క్యాన్సర్ వస్తుందట ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తీసుకోవడం వలన ఇస్కిమిక్ హార్ట్ డిసీస్, డైవర్టి క్యులర్ డిసీజ్ తో పాటుగా మధుమేహం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చికెన్ ఎక్కువగా తీసుకోవడం వలన పొట్టలో పుండ్లు కలగడం, గాల్బ్లాడర్ డిసీస్, షుగర్ ఇలా పలు సమస్యలు కలుగుతాయని నివేదిక చెప్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన రీసెర్చ్ ప్రకారం రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం తీసుకోవడం వలన తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది. కాబట్టి అతిగా మాంసాహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. దాని వలన అనేక నష్టాలు కలుగుతాయి అని తెలుసుకోండి.
Also read:
- పిల్లల అల్లరి బాగా ఎక్కువగా ఉంటోందా..? ఇలా చెయ్యాలైతే..!
- చిలుకే ఎందుకు మనుషుల్లా శబ్దాలు చేస్తుందో తెలుసా..?
- కూరలో ఉప్పు ఎక్కువైందని పారేయద్దు.. ఇలా చెయ్యండి సరిపోతుంది..!