దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఏమీ లేని వాళ్ళకి ఏమైనా ఇవ్వడం వలన పుణ్యం వస్తుంది. చీమలకి ఆహారాన్ని పెట్టడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది. బియ్యం పిండిలో కొంచెం చక్కెర వేసి కానీ బెల్లం కానీ కలిపి చీమలకి పెడితే పుణ్యం కలుగుతుంది. లేకపోతే చీమలకి వట్టి చక్కెరను ఇస్తే కూడా మంచి జరుగుతుంది.
Advertisement
చీమలకి ఆహారాన్ని పెట్టడం వలన పదివేల మందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుందట. ఇళ్లల్లో మనుషులు తిరిగే చోట కాకుండా చీమలు ఎక్కువగా ఉండే చోట పెడితే మంచి ఫలితం ఉంటుంది. తేనెని తమలపాకులలో కానీ రావి ఆకులలో కానీ వేసి సూర్యుడికి, తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడ వదిలేస్తే కూడా చక్కటి ఫలితం వస్తుంది.
Advertisement
Also read:
చీమలకు తేనెని పెడితే దోషాలు అన్నీ తొలగిపోతాయి. హ్యాపీగా ఉండొచ్చు. దానం చేస్తే దరిద్రం నుంచి కూడా సులువుగా బయటపడొచ్చు. దానం చేయడం వలన సిరిసంపదలు కూడా కలుగుతాయి. శక్తి లేని వాళ్ళు ఉన్నది ఏమైనా ఇస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఏమైనా ఉన్నవాళ్లు శక్తి కొద్ది దానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!