Home » తమ్ముడు సినిమాలో సెకండ్ హీరోయిన్ మీకు గుర్తుకు ఉందా..? ఇప్పుడు ఎలా మారిందంటే..?

తమ్ముడు సినిమాలో సెకండ్ హీరోయిన్ మీకు గుర్తుకు ఉందా..? ఇప్పుడు ఎలా మారిందంటే..?

by Anji
Ad

హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి.. ఈ పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రం లోనిది ఈ పాట. అప్పట్లో ఈ సాంగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇందులో కనిపించినటువంటి హీరోయిన్ కూడా అప్పట్లో అంతే ఫేమస్.. 1999లో తమ్ముడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ అందాల బామ.. తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ సరసన తొలి సినిమాలోనే జతకట్టి అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె మరెవ్వరో కాదు.. అదితి గోవిత్రికర్. 

Also Read :  తారకరత్న భార్య అలేఖ్యకి ఇదివరకే పెళ్లి జరిగిందా.. ఆమె మొదటి భర్త ఎవరో తెలుసా ?

Advertisement

2002లో సోచ్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేసింది. ఆ తరువాత 16 డిసెంబర్, బాజ్, డే దనాదన్, భేజా ఫ్రై 2, స్మైల్ ప్లీజ్, కోయి జానే నా లాంటి చిత్రాలలో నటించింది. ఇవేవి కూడా ఆమెకు మంచి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. సిల్వర్ స్క్రీన్ పై మాత్రమే కాదు.. బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అదితి గోవిత్రికర్. పలు హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ లలో తన నటనతో అభిమానులను మెప్పించింది.  

ఇక అదితి పరల్సనల్ విషయానికొస్తే.. 1998లోనే ఈమె దావూడి బొహ్ర అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరికి ఇద్దరూ సంతానం. పలు వ్యక్తిగత కారణాల వల్ల జంట 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి ప్రస్తుతం తన పిల్లలతో కలిసి ముంబైలోని సోదరి ఆర్జూ గోవిత్రికర్ లో నివసిస్తుంది. అలాగే ఇటీవల సైకాలజీలో తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అదితి ప్రస్తుతం లండన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతుంది. అదితి గోవిత్రికర్ అటు మోడలింగ్.. ఇటు డాక్టర్ డిగ్రీ రెండింటిి హ్యాండిల్ చేస్తూ.. ముందుకు సాగుతోంది. 

Also Read :  రెండో పెళ్లికి రెడీ అంటున్న 7/g బృందావన్ కాలనీ హీరోయిన్..మరీ ఇంత లేటుగా !

Visitors Are Also Reading