Home » రెండో పెళ్లికి రెడీ అంటున్న 7/g బృందావన్ కాలనీ హీరోయిన్..మరీ ఇంత లేటుగా !

రెండో పెళ్లికి రెడీ అంటున్న 7/g బృందావన్ కాలనీ హీరోయిన్..మరీ ఇంత లేటుగా !

by Bunty
Ad

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన 7/జి బృందావనం సినిమా 2004 అక్టోబర్ 15న విడుదలైంది. ఇక ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో రవికృష్ణ రవిగా, సోనియా అనితగా నటించారు. వీరిద్దరి మధ్య ఆ సీన్స్ అద్భుతంగా పండించారు దర్శకుడు. ఇందులో ముఖ్యంగా సాంగ్స్ కోసమే చాలామంది కుర్రాళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమాను వీక్షిస్తుంటారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సోనియా అగర్వాల్ అప్పట్లో కుర్రాళ్ళ క్రష్. ఆమె అందంకు కుర్రాళ్ళంతా ఫిదా అయ్యారు అని చెప్పాలి.

Advertisement

Advertisement

ఈ భామ తెలుగు, తమిళ్ భాషల్లో నటించింది. 7/ జి బృందావన్ కాలనీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అదే సినిమా దర్శకుడు సెల్వరాఘవన్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. అయితే పెళ్లి తర్వాత తన భర్తతో విభేదాలు రావడంతో ఆమె సెల్వ రాఘవన్ నుంచి విడిపోయారు. అప్పటి నుంచి ఆమె సింగిల్ గానే ఉంటున్నారు. తాజాగా సోనియా రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సోనియా అగర్వాల్ ప్రస్తుతం ఫాల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. సరైన సమయం వస్తే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని చెప్పుకొచ్చింది. నన్ను రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని సోనియా అగర్వాల్ చెప్పుకొచ్చింది.

EAD ALSO : Pooja Hegde : పూజ హెగ్డే ఇంట పెళ్లి సందడి… బుట్ట బొమ్మ ఎమోషనల్ నోట్

Visitors Are Also Reading