సూపర్ స్టార్ కృష్ణ..ఈ పేరును మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏఎన్నార్, ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన శైలిలో దూసుకుపోతూ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో కృష్ణ గారికి ఉన్న అభిమాన సంఘాలు ఇంకే హీరోకి లేవు. ప్రస్తుతం వయోభారంలో ఉన్న ఆయన ఇంటి దగ్గర ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
Advertisement
ఏవైనా పెద్ద పెద్ద కుటుంబ ఫంక్షన్ లలో కనిపించడం తప్పా ఎక్కువగా కనిపించడం లేదు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆయన అభిమానులందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవలి కాలంలో తమ కుటుంబానికి సంబంధించిన ఒక వేడుకలో కృష్ణ గారు పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియోలను ఫోటోలను కృష్ణ గారి కూతురు మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోల్లో కృష్ణ గారి మొహం లో ఏదో తేడా కనిపించడం తో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisement
ఆయన మొహం మీద ఏవో మచ్చలు వచ్చినట్లు కనిపించడంతో కృష్ణకు ఏమైంది అని ఆయన అభిమానులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ గారి సన్నిహితులు ఆయనకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇన్విజిబుల్ గా ఉండే ఫేస్ మాస్క్ ధరించారని, ఆ మాస్క్ మొహంలో కలిసి పోవడం వల్ల ఆయన ముఖం అలా కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చారు. కృష్ణగారు ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి :
అక్కినేని నాగార్జున ఆ నిర్ణయం తీసుకున్నారా ? సమంత కి మరో షాక్ తప్పదా ?
కెజీఎఫ్- 2 పై పొగడ్తలు ఆ హీరోలపై సెటైర్ లు…వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్…!
అద్దె గర్భం ద్వారా పిల్లలను కన్న సెలబ్రెటీలు వీళ్లే..!