తెలుగు సినిమాలో ఎన్టీఆర్ కు ఉండే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగు సినిమా ప్రస్తావన వస్తే చెప్పే మొదటి పేరు ఎన్టీఆర్ అనడంలో సందేహం లేదు. చాలా మందికి తెలుగు సినిమా పోస్టర్ అంటే అన్నగారు. పౌరాణిక, జానపద, సాంఘీకం ఇలా ఎన్నో సినిమాలతో ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్ చేసారు. వరుస విజయాలతో ప్రతీ ఏటా పదుల సినిమాలు విడుదల చేస్తూ బిజీగా గడిపారు.
Advertisement
ఆయనతో సినిమాలు చేయడానికి ఎందరో హీరోయిన్ లు అప్పట్లో పోటీ పడ్డారు. 1970 తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన సినిమాలను చూడటానికి జనాలు నిద్రలు మానుకుని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళే వాళ్ళు. ఇక ఆ సమయంలో దర్శకుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒక కథ రెడీ చేసుకున్నారు. అదే వేటగాడు సినిమా… ఈ సినిమా సాధించిన విజయం ఇప్పటికి కూడా ఒక సంచలనమే.
Advertisement
అయితే సినిమాకు అన్నీ రెడీ గా ఉన్నా సరే హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ రాలేదు. చాలా రోజులు హీరోయిన్ విషయంలో స్పష్టత రావడం లేదు. రాఘవేంద్ర రావు మాత్రం హీరోయిన్ విషయంలో శ్రీదేవి అనే మాట మినహా మరో మాట లేదు. నిర్మాతలు మాత్రం ఆమెను వద్దంటే వద్దని అన్నారు. అన్నగారి పక్కన శ్రీదేవి మరీ చిన్న పిల్లలా ఉంటుంది వద్దంటున్నారు. అయితే శ్రీదేవి ని ఒప్పించేందుకు కష్టపడుతున్నారు దర్శకుడు.
ఆమె కూడా అన్నగారి పక్కన చేయడానికి ఇష్టపడటం లేదు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది. నిర్మాతలను పిలిచి మాట్లాడిన ఎన్టీఆర్… అసలు విషయం అడిగితే… 5 ఏళ్ళ క్రితం మీ పక్కన హీరోయిన్ గా నటించింది… ఇప్పుడు ఆమెను హీరోయిన్ అంటే జనాలు రిసీవ్ చేసుకునే సీన్ లేదన్నారు. దీనితో అన్నగారు రియాక్ట్ అయి… సినిమాల్లో నటించే వారికి సెంటిమెంట్ లు చూడకండి… ప్రేక్షకులు దేవుళ్ళు.
వాళ్ళు అన్నీ రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎందుకు బాధ, నాదీ బాధ్యత… మీకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడతా అని హామీ ఇచ్చారు. కథ బలంగా ఉండాలి గాని ఇవన్నీ ఎందుకు అన్నారట. శ్రీదేవిని కూడా ఆయనే స్వయంగా ఒప్పించారు. కట్ చేస్తే… ఆ జోడీ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి.