Home » మా బాబే..మా బాబే..డైలాగ్ బామ్మ గుర్తుందా.. యుక్త వయసులో ఎంత అందంగా ఉందంటే..?

మా బాబే..మా బాబే..డైలాగ్ బామ్మ గుర్తుందా.. యుక్త వయసులో ఎంత అందంగా ఉందంటే..?

by Sravanthi
Ad

ఎంతో నిర్మలమైన మనస్సు ఆమెది.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఎంతో సహజత్వంతో బామ్మ పాత్రలో నటించడమే కాదు వాటికి జీవం పోసి బామ్మ అంటే టక్కున గుర్తుకు వచ్చే విధంగా నటించింది ఆ అమ్మ.. మీకు గుర్తుకు రాలేదా.. ఆవిడేనండి నిర్మలమ్మ…గట్టిగా మందలించినా.. మళ్ళీ వెంటనే మా బాబే.. మా బాబే.. అంటూ దగ్గరకు తీసుకున్నా ఆమెకే చెందుతుంది అని చెప్పవచ్చు.. బాబు డైరెక్షన్ లో వచ్చిన మంత్రిగారి వియ్యంకుడు అనే చిత్రంలో తన నటనతో అదరగొట్టింది..

Advertisement

ALSO READ;ముగ్గురి మ‌ర‌ణాల‌కు ఉన్న లింక్ ఒక‌టే.. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్‌ని భ‌య‌పెడుతున్న సెంటిమెంట్..!

ఆ తర్వాత మయూరి సినిమాలో మనవరాలి కోసం పరితపించే బామ్మ పాత్రలో జీవించిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు గాను ఆమెకు నంది అవార్డు కూడా దక్కింది.. ఆమె తన కెరీర్ ప్రారంభంలో అమ్మ,అత్త పాత్రలు చేసి.. ఆ తర్వాత కెరీర్ మొత్తం బామ్మ పాత్రలకే పరిమితమైంది.. కొన్ని సందర్భాల్లో నిర్మలమ్మ పాత్ర లేకుండా సినిమాలు వచ్చేవి కావు అంటే అతిశయోక్తి కలగకమానదు. అప్పట్లో ఆమెకు ఎంత డిమాండ్ ఉందో ఇలాంటివి చూసి అర్థం చేసుకోవచ్చు.. నిర్మలమ్మ అసలు పేరు రాజమణి.. నాటకాలంటే విపరీతమైన ఇష్టం. ఆమె కుటుంబ సభ్యులు ఆమె నటనా రంగానికి రాకుండా అడ్డు చెప్పారు.

Advertisement

కానీ వారి పెదనాన్న మద్దతుతో నాటకాల్లో రాణించింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నిర్మలమ్మ 1943లో తన పదహారవ యేట.. గరుడ గర్వభంగం అనే చిత్రంలో చెలికత్తె పాత్రలో తొలిసారి తెరపై అదరగొట్టింది. అలా ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం సుమారు 1000 చిత్రాల్లో నటించే విధంగా చేసింది. ఇక సీతారామరాజు సినిమాలో మాత్రం ఏకంగా ప్రతినాయక లక్షణాలతో మెప్పించిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు గాను ఆమెకు నంది అవార్డు లభించింది. చిరంజీవి స్నేహం కోసం సినిమా తర్వాత నటనకు దూరమైంది. ఇక 2009లో నిర్మలమ్మ కన్నుమూసింది.. అయితే నిర్మలమ్మ వ్యక్తిగత విషయాలకు వస్తే.. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత 19 వ యేటనే ఆమెకు వివాహం జరిగింది.

ALSO READ:

Visitors Are Also Reading