Home » Honey Rose : హనీ రోజ్ పై ఇండస్ట్రీ బ్యాన్‌ ?

Honey Rose : హనీ రోజ్ పై ఇండస్ట్రీ బ్యాన్‌ ?

by Bunty
Ad

స్టార్‌ హీరోయిన్‌ హనీరోజ్ గురించి ఎంత చెప్పినా..తక్కువే అవుతుంది. వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య సరసన నటించిన హనీరోజ్ ఈ సినిమాలో అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అంతకుముందు పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

Advertisement

ఇక ఈ సినిమా అనంతరం తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. వీరసింహారెడ్డి సినిమా అనంతరం ఈ బ్యూటీ వరుస అవకాశాలను అందుకుంటుంది. సినిమాలలో మాత్రమే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, అలాగే పలు బ్రాండ్లకు ప్రమోషన్లు కూడా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గా “రాహేలు” సినిమాలో ప్రత్యేకమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలో హనీరోజ్ బీఫ్ అమ్ముతూ కనిపిస్తుంది.

Advertisement

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో హనీరోజ్ కత్తి పట్టుకొని బీఫ్ ని కొడుతూ కనిపించింది. ఆ పోస్టర్లో హనీరోజ్ పక్కన దున్నపోతు తలకాయలు ఉన్నాయి. చాలా సీరియస్ గా హనీరోజ్ లుక్స్ ఇస్తూ…చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈ సినిమాలో హనీరోజ్ బీఫ్ అమ్మే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హనీరోజ్ కనిపించే తీరు కంటే బీఫ్ మీదనే ప్రజల దృష్టి పడింది. దీంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Visitors Are Also Reading