Home » ఈ పావురాలు యమ కాస్ట్లీ..ఒకటి 14 కోట్లు…ఒకటి 10కోట్లు…!

ఈ పావురాలు యమ కాస్ట్లీ..ఒకటి 14 కోట్లు…ఒకటి 10కోట్లు…!

by AJAY

సాధారణంగా పావురాలు జత కి 200 నుండి 300 పలుకుతాయని తెలుసు. ఇక హైదరాబాద్ లో అయితే గల్లీ గల్లీలోనూ ఇంటి పై వచ్చి వాలుతుంటాయి. వాటిని పట్టించుకునే నాథుడే ఉండదు. కానీ పావురానికి కోట్ల ధర పలుకుతుందని మీకు తెలుసా… కోట్ల రూపాయలు పెట్టి పావురాలను కొంటారని ఎప్పుడైనా విన్నారా.. కానీ అదే నిజం.. అయితే ఆ పావురాలు మాత్రం వేరుగా ఉంటాయి. అవే హోమింగ్ రేస్ పావురాలు. బెల్జియంలో ఈ పావురం రూ. 14 కోట్లు పలికింది…అతేకాకుండా చైనా వాళ్ళు ఈ పావురాన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే వాటి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పావురాలను ఇప్పుడు మన విశాఖకు చెందిన ఒక కుటుంబం కూడా పెంచుతోంది. అంతే కాకుండా తండ్రుల కాలం నుండి ఆ హోమింగ్ రేసు పావురాలను పెంచడం విశేషం. అసలు మ్యాటర్ లోకి వెళితే… బుక్కా సింగ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో నివాసం ఉండేవాడు. బతుకు తెరువు కోసం అతడు కుటుంబంతో కలిసి విశాఖకు వెళ్లాడు. అయితే హైదరాబాద్ లో ఉన్న సమయంలో బుక్కా సింగ్ కొన్ని పావురాలను మచ్చిక చేసుకున్నాడు. వాటికి రేసింగ్ లో శిక్షణ ఇచ్చాడు. దాంతో బుక్కా సింగ్ ఏది చెప్తే పావురాలు అది చేసేలా శిక్షణ పొందాయి. కొంతకాలం తర్వాత బుక్కా సింగ్ మరణించారు. దాంతో ఆ పావురాల బాధ్యతను బుక్కా సింగ్ కుమారులు చూసుకుంటున్నారు.

విశాఖ లోని సేవా నగర్ కాలనీలో వారు నివాసం ఉంటున్నారు. వారే టాంక్ శ్యామ్ సింగ్ మరియు హర్దీప్ సింగ్ వీరిద్దరూ తమ తండ్రి పెంచిన పావురాలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటికి ఆహారం పెడుతూ పెంచుకుంటున్నారు. అయితే తమ తండ్రి చనిపోయిన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం తో రెండు జతల పావురాలు మరో వ్యక్తికి అమ్మారట… కానీ ఆ పావురాలు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేశాయట. ఆ తర్వాత ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా పావురాలను అమ్మలేదట. ఇక తమ వద్ద ఉన్న పావురాలను పూణే, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో విడిచిపెట్టి ఇంటికి రాగా అవి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుకున్నయట. ఇక రేసింగ్ పావురాలను అవి ప్రయాణించే దూరాన్ని బట్టి వేగాన్ని బట్టి మూడు రకాలుగా విభజిస్తారట.

600 కిలోమీటర్లు ప్రయాణం చేసే దాన్ని షార్ట్ అని అని అంటారు. వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసే వాటిని మిడిల్ అంటారు. అదే 1500 నుండి మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే వాటిని లాంగ్ అంటరాని వివరించారు. ఇక ప్రస్తుతం తమ వద్ద ఉన్నవి ఎక్కడ వదిలిపెట్టినా వస్తున్నాయని త్వరలో కోల్ కతా మరియు బంగ్లాదేశ్ లో జరగబోయే పోటీలకు తాము హాజరవుతానని విజేతలుగా నిలుస్తారని టాంక్ శ్యామ్ సింగ్ సోదరులు చెబుతున్నారు. అంతే కాకుండా తమకు ప్రభుత్వ సహకారం ఉంటే బాగుంటుందని కోరుతున్నారు.

Visitors Are Also Reading