Home » మొటిమలతో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే చాలు.. వెంటనే పోతాయి..!

మొటిమలతో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే చాలు.. వెంటనే పోతాయి..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలని అనుకుంటుంటారు. అందంగా కనిపించడం కోసం అనేక రకాల ప్రొడక్ట్స్ ని వాడడం, ఇంటి చిట్కాలు ని పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. పింపుల్స్ మొఖం మీద ఉంటే అందం పాడవుతుంది. పైగా చూడడానికే అస్సలు బాగోదు ముఖం మీద పింపుల్స్ ఉన్నట్లయితే వాటి నుండి బయటపడడానికి చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కాలుష్యం దుమ్ము మన చర్మ ఆరోగ్యం పై ప్రభావం పడేలా చేస్తుంది. ఒత్తిడి, హార్మోన్లు, జంక్ ఫుడ్ మొదలైనవి కూడా చర్మం పై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటన్నిటి వలన మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. మొటిమల వలన చర్మం లో ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా క్లోజ్ అయిన రంధ్రాలలో బ్యాక్టీరియా పేరుకు పోతుంది.

pimples 1

Advertisement

అలానే దీనివలన విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది మొటిమలు ముఖం మీద మచ్చల్ని కలిగేటట్టు చేస్తాయి. ఇలా అందం దెబ్బ తింటుంది మొటిమలను నయం చేయాలంటే ఇలా ఈజీగా నయం చెయ్యచ్చు. మరి మొటిమల్ని ఎలా పోగొట్టుకోవచ్చు అనేది చూద్దాం. కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది కలబందలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి కలబందని ఉపయోగిస్తే మొటిమలు ఈజీగా తొలగిపోతాయి మీ ఇంట్లో కలబందని ఈజీగా పెంచుకోవచ్చు.

Advertisement

కలబందతో మొటిమల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. కలబంద గుజ్జు ని ముఖానికి రాసి 15 నిమిషాల వరకు ఉంచేసి తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే మొటిమల్ని తగ్గించుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్ కూడా చక్కగా పనిచేస్తుంది టీ ట్రీ ఆయిల్ ని రాసుకోండి. అలానే గ్రీన్ టీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది గ్రీన్ టీ బ్యాగ్ ని కొద్దిగా తడిపేసి లేదంటే గ్రీన్ టీ ని తయారు చేసి చల్లార్చి మొటిమల మీద మీరు అప్లై చేసుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ ని రాస్తే కూడా మొటిమలు ఈజీగా తగ్గిపోతాయి ముఖానికి తేనె రాస్తే కూడా మొటిమలు ఈజీగా తగ్గిపోతాయి ఇలా ఈజీగా మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు అందాన్ని పెంపొందించుకోవచ్చు.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading