Home » Hold in a sneeze : బలవంతంగా తుమ్ము ఆపుకుంటున్నారా..?

Hold in a sneeze : బలవంతంగా తుమ్ము ఆపుకుంటున్నారా..?

by Bunty
Ad

 

Hold in a sneeze  : ప్రతి ఒక్కరూ కొన్ని సందర్భాల్లో తుమ్ముని ఆపుకుంటూ ఉంటారు. ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు, దేవాలయాల్లో ఉన్నప్పుడు తుమ్ముని ఆశుభంగా భావించి చాలామంది ఆపుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతాయట. మన తుమ్ముని ఆపుకోవడం వల్ల మన శరీరానికి చాలా నష్టం కలుగుతుందని వైద్యులు చెబుతుంటారు. అంతేకాకుండా మనం తుమ్మినప్పుడు చాలా గట్టిగా తుమ్మడం వల్ల కూడా ఇబ్బంది జరుగుతుందట.

Hold in a sneeze

తుమ్ముని ఆపుకున్నప్పుడు తల లేదా మెడ భాగంలోని నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉంటుందట. తుమ్ము ప్రెషర్ ను ఆపుకోవడం వల్ల చెవిపోటుకు దారితీసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గొంతు సమస్యలు కూడా వస్తాయి. అందువల్లనే తుమ్ముని ఆపాలని అస్సలు అనుకోకూడదు. ముక్కులో ఉండే భాగాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఇవి ఏదైనా దుమ్ముకు గాని బూజు, స్పైసీ వాసనకి తుమ్ము వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు తుమ్ముని ఆపకుండా తుమ్మేయాలి. రీసెంట్ గా ఓ వ్యక్తి తుమ్ముని చాలాసార్లు ఆపుకున్నాడట.

Advertisement

Hold in a sneeze

అతనికి కొన్ని రోజులకి తీవ్రమైన గొంతు నొప్పి వచ్చి డాక్టర్ వద్దకు వెళ్ళగా స్కానింగ్ లో అతని లోపలి భాగంలో ఒక నరం తెగిపోయిందట. తుమ్ముని ఆపినప్పుడు ఆ గాలి ప్రెషర్ వల్ల మన శరీరంలో ఎక్స్ట్రా ప్రభావం చూపిస్తుందని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలోని కొన్ని పార్ట్స్ పాడయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ తుమ్ముని ఆపుకోవడం వల్ల మన శరీరానికి అనారోగ్యం జరుగుతుందని, అలా చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading