Home » కొత్త ఇంట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ…ఫోటోలు వైరల్..!

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ…ఫోటోలు వైరల్..!

by AJAY
Ad

బిగ్ బాస్ టీవీ షో ద్వారా అభిమానులు సంపాదించుకున్న వాళ్లలో నటి హిమజ కూడా ఒకరు. హిమజ మొదట బుల్లితెరపై సీరియల్స్ లో నటించింది. సర్వాంతర్యామి అనే సీరియల్ ద్వారా హిమజ బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం లాంటి సీరియల్స్ లో నటించింది. ఇలా సీరియల్స్ లో నటిస్తున్న క్రమంలోనే హిమజకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది.

 

అయితే సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వచ్చింది. బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా హిమజ అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లో నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి, వినయ విధేయ రామ, చిత్రలహరి, టెన్త్ క్లాస్ డైరీస్ తో పాటు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. హిమజ సోషల్ మీడియాలోనూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. దాంతో సోషల్ మీడియాలో హిమజకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం సినిమాలు సీరియల్స్ సోషల్ మీడియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హిమజ ఫుల్ గా సంపాదిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన హిమజ తాజాగా సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకుంది.

Advertisement

Advertisement

అంతేకాకుండా తన సంపాదనతోనే నాలుగు అంతస్తుల ఇంటిని నిర్మించుకుంది. ఈ క్రమంలో తాజాగా హిమజ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను హిమజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. గృహప్రవేశం జ్ఞాపకాల కోసం నిర్మించుకున్న ప్రదేశం ఈ కొత్త ఇల్లు… నా కలలు సహకారం అయ్యాయి. ఈ మైలురాయిని అందుకున్నందుకు నాకు నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. అంటూ రాసుకుంది. ఇక ఈ వేడుకకు అరియానా గ్లోరీ… సిరి హనుమంతు తో పాటు పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు.

Visitors Are Also Reading