Home » రీరిలీజ్ ల‌లో ఫ‌స్ట్ డే వ‌సూళ్ల వ‌ర్షం కురింపించిన 9 సినిమాలు ఇవే…!

రీరిలీజ్ ల‌లో ఫ‌స్ట్ డే వ‌సూళ్ల వ‌ర్షం కురింపించిన 9 సినిమాలు ఇవే…!

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొత్త‌ట్రెండ్ న‌డుస్తోంది. ఒక‌ప్పుడు విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన సినిమాల‌ను మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు. హీరో బ‌ర్త్ డే రోజునో లేదంటే ఇత‌ర స్పెష‌ల్ డేస్ చూసో సినిమాను విడుద‌ల చేస్తున్నారు. కాగా ఇప్పుడు అలా విడుదల చేసిన సినిమాల ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ వివరాలు తెలుసుకుందాం..

Advertisement

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన కుషి సినిమా అప్ప‌ట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమాను ఫ్యాన్స్ కోరిక‌మేర‌కు రీరిలీజ్ చేశారు. కాగా రీరిలీజ్ లో ఈ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4.15 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ప‌వ‌న్ న‌టించిన మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా జ‌ల్సా ను కూడా రీరిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు మొద‌టి రోజు 3.20 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

Advertisement

మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన ఒక్క‌డు సినిమాను కూడా రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఫ‌స్ట్ డే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2.50 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అదేవిధంగా మ‌హేశ్ బాబు న‌టించిన పోకిరి సినిమాను సైతం రీరిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకు 1.73 కోట్ల క‌లెక్ష‌న్ లు వ‌చ్చాయి.

రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆరెంజ్ సినిమా అప్పుడు ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను రీరిలీజ్ చేయ‌గా 1.53 కోట్ల క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది.

అల్లు అర్జున్ హీరోగా న‌టించిన దేశ‌మురురు సినిమాను రీసెంట్ ఆయ‌న బ‌ర్త్ డే కు విడుద‌ల చేశారు. ఈ సినిమాకు మొద‌టి రోజు 1.50 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. బాల‌య్య న‌టించిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమా రీరిలీజ్ లో 1.10 కోట్ల క‌లెక్ష‌న్స్ ను సాధించింది. ప్ర‌భాస్ న‌టించిన బిల్లా సినిమా రీరిలీజ్ లో 1.05 కోట్ల‌ను వ‌సూళు చేసింది.

 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చదవండి

Visitors Are Also Reading