టాలీవుడ్ లో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది వ్యాపారంలోనూ రానిస్తున్నారు. అలా బిజినెస్ లో రానిస్తున్న హీరోలలో ప్రిన్స్ మహేశ్ బాబు ముందు వరుసలో ఉంటారు. మహేశ్ బాబు ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లు కూడా చూసుకుంటున్నారు. ప్రిన్స్ ఇప్పటికే ఏఎంబీ థియేటర్ తో థియేటర్ల రంగంలో ఎంతో పేరుతెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి క్లాత్ బిజినెస్ ను కూడా ప్రారంభించాడు. మరోవైపు ఓ ఇంటర్నేషన్ కంపెనీతో కలిసి మహేశ్ బాబు ఆన్ లైన్ ఎడ్యుకేషన్ రంగంలోకి సైతం అడుగుపెడుతున్నాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం రెండు మూడు సాలిడ్ హిట్లు పడగానే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రౌడీ వేర్ పేరుతో విజయ్ ఆన్ లైన్ లో దుస్తులు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా మహబూబ్ నగర్ లో విజయ్ మల్టీపెక్స్ ను కూడా ప్రారంభించాడు. ఇదిలా ఉండగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా హోటల్ బిజినెస్ లోకి సైతం అడుగుపెట్టాడు.
Advertisement
Advertisement
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా వ్యాపారంలో రానిస్తున్నారు. ట్రూ జెట్ ఎయిర్లైన్స్ పేరుతో చరణ్ విమానయానరంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చరణ్ కు గుర్రాలంటే ఇష్టంతో పోలో బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టాడు.
మన్మథుడు నాగార్జున సినిమాల్లో బిజీగా ఉండటంతో పాటూ వ్యాపారాల్లోనూ సత్తాచాటుతుంటారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణతో పాటు సినిమాలనిర్మాణం, ఫుట్ బాల్ టీమ్, ఓ రేసింగ్ కంపెనీ కూడా ఉంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సినిమాలతో పాటూ వ్యాపారంలో రానిస్తున్నారు. బన్నీకి హైదరాబాద్ లో ఓ పబ్ ఉంది. దీనిని గ్రాండ్ గా లాంఛ్ చేశారు. అదే విధంగా అల్లు అర్జున్ అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్ లో ఏఏఏ పేరుతో థియేటర్ ను నిర్మిస్తున్నారు.