Home » ఫ్యాన్స్ ని పెళ్లి చేసుకున్న 5 గురు నటులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!

ఫ్యాన్స్ ని పెళ్లి చేసుకున్న 5 గురు నటులు వీరే.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సెలెబ్రెటీలకు విపరీతమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. వారు ఏ పని చేసినా అది పెద్ద సంచలన వార్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సెలెబ్రిటీల పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి పెళ్లి ఫిక్స్ అవ్వకముందు నుంచే గాసిప్స్ మొదలైపోతూ ఉంటాయి. ఇక సెలెబ్రిటీలు కూడా తమను ఎంతో అభిమానించే ఫ్యాన్స్ విషయంలో కేర్ ఫుల్ గా ఉంటారు. ఇక కొంతమంది సెలెబ్రిటీలు తమ ఫ్యాన్స్ ని ఏకంగా పెళ్లి చేసేసుకున్నారు కూడా. అలా ఫ్యాన్స్ ని పెళ్లి చేసుకున్న సెలెబ్రిటీల గురించి ఇపుడు తెలుసుకుందాం.

1. మాధవన్, సరిత బిజ్రే:

Advertisement


తమిళ నటుడు మాధవన్ తన భార్య సరితను కమ్యూనికేషన్స్ స్కిల్స్ క్లాస్ లో కలిసారుట. సినిమాల్లోకి రాకముందు నుంచే మాధవన్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ క్లాసులు చెప్పీవారట. అలా మొదలైన పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.

2. విజయ్, సంగీత


ఇళయదళపతి విజయ్ కూడా తన అభిమానినే పెళ్లి చేసుకున్నారు. ఆయన తన భార్యని షూటింగ్ ప్లేస్ లో కలిసారుట. విజయ్ అంటే ఇష్టమని ఆమె చెప్పడంతో ఆటోగ్రాఫ్ తో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారట. అలా వీరి పరిచయం మొదలై పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది.

Advertisement

3. ఈషా డియోల్, భరత్ తక్తాని:

భరత్ తక్తానీ ఓ పెద్ద బిజినెస్ మాత్రమే కాదు ఈషాకు పెద్ద ఫ్యాన్ కూడా. వీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

4. రజినీకాంత్, లత:


సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయి, ఆయన ఫ్యాన్ లతతో ఆయన ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ఫిబ్రవరి 26, 1981 లో తిరుపతిలో వివాహం చేసుకున్నారు.

5. రాజేష్ కన్నా, డింపుల్ కపాడియా:


డింపుల్ కపాడియా రాజేష్ కన్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రాజేష్ సినిమాలకు దూరం అయ్యారు. కానీ ఆయనపై ఉన్న అభిమానంతో డింపుల్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

టాలీవుడ్‌ హీరోతో డేటింగ్‌లో సామజవరగమన హీరోయిన్‌ ?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading