వరుస ఫ్లాప్ లు పడుతుంటే హీరోల కెరీర్ ముగిసిపోతున్నట్టు సంకేతం. వరుస ఫ్లాప్ లలో ఉన్న హీరోలతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు రారు. స్టార్ డైరెక్టర్ లు అలాంటి హీరోలతో సినిమాలు చేయరు. అయితే అలా వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న హీరోలకు కూడా ఒక్క హిట్ పడితే చాలు. మళ్లీ ఆఫర్ లు క్యూ కడతాయి.
Advertisement
అలా కొంతమంది టాలీవుడ్ హీరోల కెరీర్ లను నిలబెట్టిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….హ్యాపిడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నిఖిల్ కు ఐదేళ్ల తరవాత మళ్లీ స్వామిరార సినిమాతో బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సినిమా తరవాత నిఖిల్ వెనక్కి చూసుకోలేదు. కందిరీగ సినిమా వరకూ సాఫీగా సాగిన రామ్ కెరీర్ లో ఆ తరవాత ఫ్లాప్ లు మొదలయ్యాయి. కాగా నేను శైలజ సినిమాతో రామ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు.
నాగార్జున ఎన్నోబ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా రానిస్తున్నాడు. కానీ నాగార్జునకు మనం సినిమాకు ముందు 7 ఏళ్ల పాటూ బ్యాడ్ టైమ్ నడిచింది. కాగా మనం సినిమాతో మళ్లీ నాగార్జునకు బ్లాక్ బస్టర్ పడింది. నితిన్ కు సై సినిమా తరవాత మరో హిట్ పడలేదు. చాలా సినిమాల్లో నటించినా అన్నీ అట్లర్ ఫ్లాపులుగానే నిలిచాయి. కానీ ఆ తరవాత ఇష్క్ తో నితిన్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
Advertisement
ఇష్క్ హిట్ తో నితిన్ మరోసారి ట్రాక్ లోకి వచ్చాడు. సూర్యకు తమిళ్ తో పాటూ తెలుగులోనూ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆకాశమే నీహద్దురా సినిమా కంటే ముందు పదేళ్లపాటూ సరైన హిట్ రాలేదు. కానీ ఆకాశమే నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాలకృష్ణకు 2004లో విడుదలైన లక్ష్మీనరసింహా సినిమా తరవాత మళ్లీ అంతటి మాస్ హిట్ పడలేదు.
కానీ ఆరేళ్ల తరవాత బాలయ్య 2010లో సింహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. పవర్ స్టార్ వపన్ కల్యాణ్ కు కుషి తరవాత మళ్లీ అంతటి హిట్ పడలేదు. కానీ గబ్బర్ సింగ్ తో మళ్లీ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అదే విధంగా మహేశ్ బాబుకు దూకుడు..రవితేజకు క్రాక్ లాంటి సినిమాలు లైఫ్ ఇచ్చాయి.