Home » అరుంధ‌తి సినిమాను చేతులారా వ‌దులుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

అరుంధ‌తి సినిమాను చేతులారా వ‌దులుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

by AJAY

సూప‌ర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క ఆ త‌ర‌వాత చాలా సినిమాల్లో న‌టించింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రితోనూ అనుష్క జోడీ క‌ట్టింది. ఆక‌ట్టుకునే అందంతో పాటూ అద్భుత‌మైన న‌ట‌న అనుష్క సొంతం. ఇక అనుష్క‌కు న‌టిగా ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం అరుంధ‌తి అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమాలో అనుష్క త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అవాక్క‌య్యేలా చేసింది.

arundhathi-movie

ద్విపాత్రాభిన‌యంతో రెండు పాత్ర‌ల‌లోనూ అద‌రగొట్టింది. కొన్ని సీన్ల‌లో అస‌లు స్కీన్ పై క‌నిపిస్తుంది అనుష్క నేనా అని ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. అప్ప‌టి వ‌ర‌కూ గ్లామ‌ర్ రోల్స్ లో క‌నిపించిన అనుష్క అరుంధ‌తిలో నెవ్వ‌ర్ బిఫోర్ పాత్ర‌లో న‌టించింది. ఇక ఈ సినిమాకు కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. అంతే కాకుండా ఈ సినిమా క‌థ పుట్టింది కూడా నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి మెద‌డులోనే అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.

అంజి సినిమా ఫ్లాప్ త‌ర‌వాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్లిపోయార‌ట‌. ఎలాగైనా ఓ హిట్ కొట్టాల‌ని నిర్న‌యించుకున్నార‌ట‌. ఈక్ర‌మంలో ఆలోచిస్తున్న‌ప్పుడు ఆయ‌న మొద‌డులో త‌ట్టిన ఆలోచ‌నే అరుంధ‌తి క‌థ‌. తను కాన్సెప్ట్ చెప్ప‌గా కోడిరామ‌కృష్ణ సినిమా క‌థ‌ను డెవ‌లెప్ చేశారు.

Arundhati

Arundhati

ఇక ఈ సినిమాలో మొద‌ట మ‌ల‌యాళ కుట్టి మ‌మ‌తా మోహ‌న్ దాస్ ను హీరోయిన్ గా అనుకున్నార‌ట‌. అయితే అప్పుడ‌ప్పుడే ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మ‌మ‌తామోహ‌న్ దాస్ ఎలాంటి పాత్ర‌లు ఎంచుకోవాలో తెలియ‌క అరుంధ‌తిని రిజెక్ట్ చేసింది. కానీ ఆ సినిమాలో న‌టించి ఉంటే ఆమె కెరీర్ మ‌రోలా ఉండేదేమో.

Visitors Are Also Reading