హీరో రాజశేఖర్ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వరుస హిట్ లు అందుకుంటూ స్టార్ హీరోలకు పోటీ ఇచ్చారు. నిజానికి రాజశేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తరవాత డాక్టర్ వృత్తిని ఎంచుకోవాల్సి ఉండగా అనుకోకుండా హీరో అయిపోయారు. మొదటి సారి రాజశేఖర్ 1985 సంవత్సరంలో వందేమాతరం అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
Advertisement
ఆ తరవాత ప్రతిఘటన, అంకుశం, అల్లరిప్రియుడు, తలంబ్రాలు ఇలా ఎన్నో సూపర్ హిట్ లు అందుకున్నాడు. ఇక ఇప్పటికీ రాజశేఖ్దర్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరగా రాజశేఖర్ గరుడేగ సినిమాతో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా తన భార్య జీవిత దర్శకత్వంలో శేఖర్ అనే సినిమాలో నటించాడు. మరోవైపు రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు కూడా హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
Advertisement
అటు శివాణి రాజశేఖర్ ఇటు శివాత్మిక రాజశేఖర్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాజశేఖర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఓ చిన్నారి సరిగ్గా పదేళ్ల తరవాత అతడికి జోడిగా నటించడం విశేషం. రాజశేఖర్ ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్ లో మమతల కోవెల అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ కు హీరోయిన్ గా సుహాసిని నటించింది. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కు కూతురిగా రాశి బాలనటిగా కనిపించింది.
అయితే సరిగ్గా పదేళ్ల తరవాత మళ్లీ రాజశేఖర్ కు హీరోయిన్ గా రాశి నటించింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నేటి గాంధీ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజశేఖర్ పక్కన హీరోయిన్ గా రాశి నటించింది. అలా రాశి రాజశేఖర్ కు కూతురుగా నటించి అతడి పక్కనే హీరోయిన్ గా నటించింది.