Home » తప్ప తాగి యాక్సిడెంట్…టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్….!

తప్ప తాగి యాక్సిడెంట్…టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్….!

by AJAY
Ad

మనదేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కారు. చట్టం ముందు అందరూ సమానులే. అయితే కొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు మాత్రం తాము ఏం చేసినా చెల్లుతుందని భావిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ల ప్రవర్తన వల్ల చిక్కుల్లో పడక తప్పదు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మద్యం తాగి కార్ నడిపింది. అంతేకాకుండా ఆమె ఓ వ్యక్తికి యాక్సిడెంట్ చేయగా అతడు గాయపడ్డాడు.

Advertisement

దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ హీరోయిన్ ను అరెస్ట్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు రీసెంట్ గా ఏక్ మినీ కథ సినిమాతో హిట్ అందుకున్న కావ్య థాపర్. ఓటీటీలో విడుదలైన ఏక్ మినీ కథ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Advertisement

 

అయితే ఈ సినిమాలోని హీరోయిన్ కావ్యా తాపర్ ఇప్పుడు మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసి అరెస్టయింది. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై హీరోయిన్ తిరగపడటమే కాకుండా బూతులు తిట్టినట్టు తెలుస్తోంది. ఓ పోలీస్ అధికారి కాలర్ పట్టుకొని కొట్టినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి.

 

దాంతో కావ్య తాపర్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జుడిషియల్ కస్టడీ విధించారు. ఇక కావ్య తాపర్ తెలుగులో ఏక్ మినీ కథ సినిమాతో పాటు “ఈ మాయ ఏమిటో, మార్కెట్ రాజా ఎంబిబిఎస్ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఏక్ మినీ కథ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

Visitors Are Also Reading