Home » డబుల్ సెంచరీ చేసిన హీరోలు..4 గురు ఇండియన్సే

డబుల్ సెంచరీ చేసిన హీరోలు..4 గురు ఇండియన్సే

by Bunty
Ad

ఇవాళ బంగ్లా దేశ్‌ మరియు టీమిండియా జట్ల మధ్య నామమాత్రపు వన్డే మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వీరవిహారం చేస్తున్నాడు. బంగ్లా బౌలింగ్ తుత్తునియలు చేస్తూ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్ లతో 200 రన్స్ చేశాడు. అయితే వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఇతర క్రికెట్ హీరోల గురించి కూడా ఓసారి అవలోకనం చేసుకుందాం.

Advertisement

సచిన్ టెండూల్కర్:
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా మరియు తొలి భారతీయ క్రికెటర్ గా కూడా సచిన్ టెండూల్కర్ ను చెప్పుకోవచ్చు. 2010లో గ్వాలియర్ స్టేడియంలో దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 200 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచి తను ఆ ఘనతను సాధించాడు.

Advertisement

వీరేంద్ర సెహ్వాగ్:
వన్డేలో డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయ క్రికెటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ను చెప్పుకోవచ్చు. 2011లో వెస్టిండీస్ తో ఇండోర్ లో జరిగిన వన్డేలో 219 పరుగులు చేసి సెహ్వాగ్ ఆ ఘనతను సాధించాడు.

రోహిత్ శర్మ:
వన్డే క్రికెట్లో మూడు సార్లు డబుల్ సెంచరీ నమోదు చేసిన వ్యక్తిగా భారత క్రికెటర్ రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. 2013, 2014లలో అలాగే 2017 తేదీన శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 208 పరుగులు చేశాడు.

క్రిస్ గేల్:
2015లో జింబాబ్వే తో జరిగిన వన్డే మ్యాచ్ లో 215 పరుగులు చేసిన క్రిస్ గేల్, వరల్డ్ కప్ సిరీస్ లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కారు.

మార్టిన్ గుప్తిల్:
2015లో వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఆ ఘనతను సాధించాడు మార్టిన్ గుప్తిల్.

READ ALSO : ఒక సారి వాడిన వంట నూనెను మళ్ళీ వాడుతున్నారా..?అయితే, ప్రాణాలకే ముప్పు తప్పదా !!

Visitors Are Also Reading