తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించాడు. కానీ పెద్దగా సక్సెస్ ని అందుకోలేక పోయాడు. ఈ మధ్యకాలంలో విశాల్ కు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా విశాల్ తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాడు. విశాల్ నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. ఈ సినిమా సెప్టెంబర్ 17న థియేటర్లోకి విడుదలైంది. ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. దీంతో ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
అందుకోసం ముంబై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సినిమా సర్టిఫికెట్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందట. ముంబై సెంట్రల్ బోర్డు కార్యాలయంపై హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేస్తూ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సీబీఎఫ్సి ముంబై కార్యాలయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు, తమిళంలో మార్క్ ఆంటోనీ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ సినిమాని హిందీలో విడుదల చేయాలనుకుంటున్నామ ని తెలియజేశారు.
Advertisement
Advertisement
అయితే మార్క్ ఆంటోనీ సెన్సార్ కోసం సెంట్రల్ బోర్డ్ ముంబై కార్యాలయానికి వెళ్తే అక్కడ వారు లంచం అడిగారట. దీంతో విశాల్ వారితో మాట్లాడుకుని 6 లక్షల లంచం ఇచ్చారట. సినిమా అదే రోజున విడుదల చేయాల్సి ఉండడంతో ఏం చేయాలో తెలియక లంచం ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఈ అవినీతిని అరికట్టాలని విశాల్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఏకనాథ్ షిండేలకు చెప్పి అవినీతిని ఆరికట్టాలని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో సీఎం ఏకనాథ్ షిండే, ప్రధాని నరేంద్ర మోడీ తనకు న్యాయం చేస్తారని అనుకుంటున్నట్లు విశాల్ పేర్కొన్నాడు. అయితే.. విశాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించిందని సమాచారం. దీనిపై విచారణ చేయాలని ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయట.
ఇవి కూడా చదవండి
- CM KCR : సీఎం కేసీఆర్ను ఓడించిన ఒక్క మగాడు !
- జగన్ కు భయపడి…ఢిల్లీలో లోకేష్ దాక్కున్నాడు – రోజా ఫైర్
- Virat Kohli : ఆసీస్ ప్లేయర్లను ర్యాగింగ్ చేసిన కోహ్లీ !