కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి అందరికీ తెలిసిందే. అతనికి తమిళంలో ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంటుంది. తన నటనతో ఎంతో మంది కోలీవుడ్, టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు సూర్య. తమిళ హీరో సూర్య సినిమా విడుదల అవుతుందంటే చాలా మంది ఈ సినిమా చూడాలని అంటుంటారు. ప్రధానంగా సూర్య శివపుత్రుడు సినిమా నుంచే తెలుగు ప్రేక్షకులు ఆదరించడం మొదలు పెట్టారు.
ఇటీవల ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులలో సూర్య సూపర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఆయన నటించిన సూరారై పోట్రు సినిమా ఏకంగా 5 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా సూర్య నేషనల్ అవార్డు సాధించారు. దీంతో ఆయనకు పలువురు స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు సూర్యకి కంగ్రాట్స్ చెబుతున్నారు. నువ్వు ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని కోరుకుంటున్నారు.
Advertisement
Advertisement
ఇలా అందరి చేత ప్రశంసలను అందుకుంటున్న సూర్య తన కెరీర్ లో సరిదిద్దుకోలేని తప్పు చేశాడు అని చాలా తక్కువ మందికి తెలుసు. హీరో సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కోలీవుడ్ లోనే బెస్ట్ కపుల్స్ గా నిలిచిన ఈ జంట ప్రేమ కోసం నానా తిప్పలు పడ్డారట. వీరు కలిసి సినిమా చేస్తున్న సమయంలో ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమ మ్యాటర్ ఇంట్లో చెబితే ఒప్పుకోరని తెలిసి ఎవ్వరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారట. కొద్ది రోజుల తరువాత ఈ విషయం బయటికొచ్చిందట. ఇక ఆ సమయంలో సూర్య, జ్యోతికలు ఇబ్బంది పడ్డారట. ఇంట్లో వాళ్లు అనరాని మాటలు అన్నారట. పెళ్లి చేసుకున్న తరువాత ఏం చేయలేమని.. పరువు కాపాడుకోవాలని అధికారికంగా మళ్లీ పెళ్లి చేశారట. తన కెరీర్ పరంగా సూర్య ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ.. మనసులో ఈ బాధ ఎప్పుడు ఉంటుందట.
Also Read :
హీరోగా నువ్వు పనికి రావని మెగాస్టార్ చెప్పిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?