టాలీవుడ్ లో స్టార్ హీరోగా రానించాల్సిన సుమన్ కెరీర్ పోలీస్ కేసుల వల్ల డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులను కూడా కొంతమంది పనికట్టుకు పెట్టించారని సుమన్ చెబుతుంటారు.తనపై కావాలనే కుట్ర చేసి కేసుల్లో ఇరికించారని చెబుతుంటారు. అంతే కాకుండా సుమన్ ను చిరంజీవి తొక్కేసారు అనే వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని సుమన్ చెప్పారు. ఆ కేసుల్లో గనక చిక్కుకోకపోయి ఉంటే సుమన్ కు అప్పట్లో ఉన్న క్రేజ్ వల్ల స్టార్ అయ్యిండేవారు.
Advertisement
Advertisement
ఇక ప్రస్తుతం సుమన్ అడపాదడపా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు సుమన్ వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుమన్ ఆ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఆల్ ఇండియా సుమన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట దూళిపాళ్ల దేవేంద్రరావు ఇంటివద్ద జరిగిన సమావేశంలో సుమన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ను కలిసినప్పుడు చిత్రపరిశ్రమ అభివృద్దికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని చెప్పారన్నారు.
అంతే కాకుండా సీరియల్స్, వెబ్ సిరీస్ లో అశ్లీల కంటెంట్ పెరిగిపోతోందని అన్నారు. సినిమాలకు మాదిరిగా సెన్సార్ ఉంటే బాగుండేదని అన్నారు. ఇక ఓ విలేకర్ మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ ప్రశ్నించగా….ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తెలుసుకునేవారికే వాళ్లు ఓట్లు వేస్తున్నారని అన్నారు. మెచ్యురిటీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించరని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు.