టాలీవుడ్ హీరో చిన్న బడ్జెట్ సినిమాలకు రారాజుగా వెళ్లాడు. సిక్స్టీన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో గర్ల్‌ఫ్రెండ్ ఈ రెండు సినిమాలు అప్పట్లో సంచలనమే సృష్టించాయి. ఆ తరువాత రోహిత్‌కు ఆఫర్లు తగ్గి ఇతర హీరో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో రోహిత్ నటించిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉంది. చివరిగా 2010లో మా అన్నయ్య బంగారంలో కనిపించి ఆ తరువాత కపించడం మానేశాడు. రోహిత్ ఖాతాలో ఒక్క మాస్ హిట్ కూడా లేదు. దీంతో రోహిత్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు.
Also Read : బాలకృష్ణ సినిమాలో బాలనటిగా నటించి.. ఆయనకు జోడిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
Advertisement
Advertisement
స్టార్ హీరోగా ఎదుగుతున్నాడనుకున్న సమయంలో టాలీవుడ్లోకి నటవారసులు అడుగు పెట్టడంతో వాళ్ల దాటికి తట్టుకోలేక ఆయన సినిమాలకు దూరమయ్యాడనే ప్రచారం జరిగింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకు సినిమా అవకాశాలు ఎందుకు రాలేదనేదానిపై స్పందించారు. నేను డైరెక్టర్ బ్యానర్ కంటే సినిమా స్క్రిప్ట్‌నే ఎక్కువగా నమ్ముతాను. స్క్రిప్ట్ బాగుంటే మాత్రం ఆ సినిమా చేసేందుకు ఇష్టపడతాను. ఆ సమయంలో నాకు చాలా డైరెక్టర్లు సినిమా కథలు వినిపించారు. కానీ నేను కథ బాగుందని లేకపోతే లేదని చాలా ఓపెన్‌గా మొహం మీద చెప్పేవాడిని. ఇలా మొహం మీద చెప్పడం వల్ల నాకే చాలా బ్యాడ్ అయిపోయింది. అలా నాకు సినిమా అవకాశాలు రావడం తగ్గాయని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు హీరో రోహిత్. తాను హీరోగా నటుస్తున్న కళాకార్ అనే సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. శ్రీను బందెల దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. కేవలం కళాకార్ సినిమాతోనే సరిపెట్టుకుంటాడా..? లేక మరి కొత్తగా అవకాశాలు దక్కుతాయా ఎదురు చూడాలి మరీ.
Also Read : Glenn Maxwell Marriage: భారతీయ మహిళతో మార్చి 27న మాక్స్వెల్ పెళ్లి