Home » తెలంగాణ రాజకీయాల్లోకి హీరో నితిన్.. నిజమాబాద్ నుంచే పోటీ ?

తెలంగాణ రాజకీయాల్లోకి హీరో నితిన్.. నిజమాబాద్ నుంచే పోటీ ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరో నితిన్… మొదటి సినిమాతోనే మంచి నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక జయం సినిమా తర్వాత దిల్, సై, శ్రీ ఆంజనేయం, సంబరం, గుండెజారి గల్లంతయింది లాంటి సినిమాలు చేసి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక కం బ్యాక్ లో ఇష్క్ సినిమాతో అందరినీ అలరించాడు హీరో నితిన్.

Advertisement

అయితే తాజాగా హీరో నితిన్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హీరో నితిన్… తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. హీరో నితిన్ ది నిజామాబాద్ జిల్లా. అయితే నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హీరో నితిన్ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ అయితే సాగుతోంది. వాస్తవానికి హీరో నితిన్ కుటుంబం… మరియు ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులకు బాగా దగ్గరగా ఉంటారు. అంతేకాదు నితిన్ మేనమామ నిజామాబాద్ జిల్లా మార్కెట్ చైర్మన్ గా కూడా పనిచేశారు.

Advertisement

ఆయన పేరు నగేష్ రెడ్డి అని తెలుస్తోంది. అయితే ఈ నితిన్ మేనమామ… ప్రస్తుతం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారట. అంతేకాదు నితిన్ మేనమామ నగేష్ రెడ్డి.. ఎప్పటినుంచో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే హీరో నితిన్ ఈ విషయంపై రేవంత్ రెడ్డి ని కూడా కలిశారట. అయితే రేవంత్ రెడ్డిని హీరో నితిన్ కలవడంతో… హీరో నితినే తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి తన మేనమామ నగేష్ రెడ్డి కోసం… ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం రేవంత్ రెడ్డిని నితిన్ కలిసినట్లు కొంతమంది అంటున్నారు. అయితే హీరో నితిన్ రాజకీయాల్లోకి వస్తారా ? లేదా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

తమీమ్ ఇక్బాల్‌కు ప్రధాని నుంచి నోటీసులు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Praveen Kumar : టీమిండియా బౌల‌ర్ ప్ర‌వీణ్ కుమార్ కారుకు ప్ర‌మాదం

Visitors Are Also Reading