నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి నటిస్తున్న తాజా చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ చూసిన ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్రబృందం. నవీన్ చంద్ర, కలర్ స్వాతి గతంలో ‘త్రిపుర’ సినిమాలో కలిసి నటించారు. ఇక మరోసారి వీరిద్దరూ జంటగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
గతంలో స్వాతితో వివాహం జరిగిందనే వార్తలపై ఆయన స్పందించారు. త్రిపుర సినిమాతో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మా రెండు ఫ్యామిలీలు కూడా మంచి స్నేహితులు స్వాతి చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసి మొదటిసారి త్రిపుర సినిమాలో నటించాము. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మా ఇద్దరిదీ కలిపి ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో మేమిద్దరం పెళ్లిదుస్తుల్లో ఉన్నాము. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసిన చాలామంది మేమిద్దరం నిజంగానే వివాహం చేసుకున్నామని అనుకున్నారు.
Advertisement
Advertisement
కొన్ని రోజులకి చిత్రబృందం అదే ఫోటోని పోస్టర్ పై రిలీజ్ చేసింది. ఆ ఫోటో చూసిన చాలామందికి క్లారిటీ వచ్చింది. మేము పెళ్లి చేసుకోలేదని, అది కేవలం సినిమా కోసం మాత్రమే అని అనుకున్నారు. మా ఇద్దరి పెళ్లి వార్తలపై చాలా రూమర్స్ వచ్చినప్పటికీ మేము ఇద్దరం వాటిని పట్టించుకోలేదు. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప అలాంటిదేమీ లేదని నవీన్ క్లారిటీ ఇచ్చారు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’ అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది.
ఇవి కూడా చదవండి
- ఇండియాలోనే వరల్డ్ కప్ 2023..BCCIకి 2200 కోట్ల లాభం !
- జూనియర్ ఎన్టీఆర్ కు తల్లిగా ప్రియమణి.. అసహనంలో ఫ్యాన్స్!
- Pooja Hegde : తెలుగు ఇండస్ట్రీకి పూజా హెగ్డే గుడ్ బై..?