లవర్ బాయ్ సిద్దర్థ్ కు టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉంది. బేసిక్ గా సిద్దార్థ్ తమిళ్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినా కూడా తన అందం నటనతో టాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ, రొమాంటిక్ చిత్రాలలో నటించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా ఎక్కువ మంది హీరోయిన్ లతో ప్రేమాయణం నడిపించిన హీరోగా కూడా సిద్ధార్థ్ కు పేరు ఉంది.
Advertisement
మరోవైపు సినిమాలతో పాటూ సిద్ధార్థ్ తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. సినిమా రాజకీయ అంశాలపై తనదైన స్టైల్ లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక గత కొంతకాలంగా సిద్ధార్థ్ ఇండస్ట్రీలో సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. రీసెంట్ గా మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బోల్తా పడింది. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిలు ఉంటాయి.
Advertisement
అయితే నిజానికి బొమ్మరిల్లు సినిమాకు దర్శకుడు భాస్కర్ వేరే హీరోను అనుకున్నారట. కానీ చివరికి ఆ ఆఫర్ సిద్ధార్థ్ వద్దకు వచ్చింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. అయితే మొదట దిల్ రాజు, భాస్కర్ లు సినిమాలో హీరోగా చేసేందుకు నవదీప్ ను స్పందించారట.
ALSO READ : నాగార్జున మోహన్ బాబు ఇద్దరిలో ఎవరు ఇష్టం…? చిరంజీవి సమాధానం ఇదే..!
కాగా అప్పటికే జై సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నవదీప్ గౌతమ్ ఎస్ఎస్సీ, ప్రేమంటే ఇంతే అనే సినిమాలలో నటిస్తున్నాడు. దాంతో బొమ్మరిల్లు సినిమాను రిజెక్ట్ చేశాడు. అయితే గౌతమ్ ఎస్ఎస్ సీ, ప్రేమంటే ఇంతే సినిమాలు విడుదలైన తరవాత ఫ్లాప్ అయ్యాయి. కానీ అదే సమయంలో విడుదలైన బొమ్మరిల్లు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు 50 కోట్లకు పైగా కలెక్షన్ లు వచ్చాయి.