ఇప్పటి కాలంలో పాతికేళ్లు దాటిన వెంటనే జుట్టు ఊడిపోతోంది పొట్టలు వస్తున్నాయి. అంతే కాకుండా కండ్ల కింద క్యారీ బ్యాగులు వచ్చేసి ఏజిడ్ లుక్ వచ్చేస్తుంది. అయితే సాధారణ ప్రజలకు అందంతో పెద్దగా పనిలేదు కానీ సెలబ్రెటీలకు మాత్రం అందమే పెట్టుబడి. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు యాబై ఏళ్లు రాకముందే అందాన్ని కోల్పోయారు.
Advertisement
ముకంపై ముడతలు పడటంతో పాటూ హీరో లుక్ లోనే కనిపించడం లేదు. అంతే కాకుండా కొంతమంది బరువు పెరిగిపోయి అంకుల్స్ లా కనిపిస్తున్నారు. కానీ టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 62 ఏళ్లు వచ్చినా కుర్రాడిలానే కనిపిస్తున్నాడు. దాంతో నాగార్జున గ్లామర్ సీక్రెట్ తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. నాగార్జున్ ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ మరియు గ్లామర్ సీక్రెన్ చెప్పాడు.
Advertisement
ఉదయం లేవగానే నాగార్జున వ్యాయామం తప్పకుండా చేస్తాడట. అంతే కాకుండా నాగార్జున తన బ్రేక్ ఫాస్ట్ లో వైట్ ఎగ్స్ తో పాటూ బ్రెడ్ ను తీసుకుంటాడట. మద్యాహ్నం లంచ్ లోకి దోశ లేదా ఇడ్లీతో పాటూ చపాతీ లేదా రైస్ తో మూడు రకాల కూరగాయలను తింటాడట. స్నాక్స్ విషయానికి వచ్చే సరికి కేవలం పండ్లను మాత్రమే తీసుకుంటాడట. అంతే కాకుండా నాగార్జున డిన్నర్ 7గంటలకే పూర్తి చేస్తాడట.
డిన్నర్ లో చికెన్ తో పాటూ నచ్చివన్నీ తినేస్తాడట. ఎంత తిన్నా కూడా జిమ్ చేసి కరిగించుకోవడం వల్లే ఫిట్ గా ఉన్నానని చెప్పాడు. అంతే కాకుండా ఎన్నో వ్యాపారాలు ఉన్నా కూడా రోజుకు కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోతాడట. రోజంతా ఎంత స్ట్రెస్ అయినా మంచి నిద్ర ఉంటే దాన్ని కవర్ చేయొచ్చని నాగార్జున చెబుతున్నాడు. ఇక నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమాలో నటించాడు. అంతే కాకుండా ప్రస్తుతం గోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు.