దక్షిణాదిలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కార్తీక్ ఒకరు. కార్తీక్ అసలు పేరు మురళీ కార్తికేయ ముత్తురామన్ కాగా ఆయన నటించిన సినిమా కార్తీక్ తో పాపులారిటీని సంపాదించుకున్నారు. నటుడుగానే కాకుండా నేపథ్య గాయకుడిగా రాజకీయనాయకుడిగానూ ఆయన రాణించారు. కార్తీక్ ప్రముఖ నటుడు ముత్తురామన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళ సినిమా అలైగల్ ఓవాత్తిలై సినిమాలో కార్తీక్ సినిమాల్లోకి హీరోగా అడుగుపెట్టారు.
Advertisement
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించారు. ఆ తరవాత హీరోగానే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో సీతాకోక చిలక, మగరాయుడు, అణ్వేషణ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తమిళ తెలుగు భాషల్లో ఆయన మొత్తం 125 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తమిళనాట ఎన్నో అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు.
Advertisement
కొన్నాళ్లకు కార్తీక్ కెరీర్ స్లో అయ్యింది. ఆ తరవాత మెల్లిమెల్లిగా సినిమాలకు దూరమయ్యారు. అంతే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. కానీ రాజకీయాల్లో ఆశించినమేర సక్సెస్ అవ్వలేకపోయారు. సొంతంగా పార్టీని స్థాపించి ఎన్నికల భరిలో దిగగా డిపాజిట్ లు సైతం గల్లంతయ్యాయి.
అంతే కాకుండా కార్తీక్ తన భార్య సోదరినే రెండో వివాహం చేసుకుని ఇబ్బందుల్లో పడ్డాడు. కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మత్తుపదార్థాలకు కూడా బానిసయ్యాడు. రాజకీయాలు దురలవాట్ల వల్ల తన సినీ కెరీర్ ను పూర్తిగా నాశనం చేసుకున్నాడని తమిళ మీడియాలో టాక్ ఉంది.
AlSO READ : నెట్టింట రౌడీ ఫ్యాన్స్ వర్సస్ జబర్దస్త్ బ్యూటీ….ఆంటీ అంటూ దారుణమైన ట్రోలింగ్..!