Home » బాలయ్య బాబు ఆ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా ? ఎన్టీఆర్, హరికృష్ణ లు ఎందుకు పెళ్ళికి ఒప్పుకోలేదు ?

బాలయ్య బాబు ఆ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా ? ఎన్టీఆర్, హరికృష్ణ లు ఎందుకు పెళ్ళికి ఒప్పుకోలేదు ?

by AJAY
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య బయట సీరియస్ గా కనిపించినా ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని ఆయనతో మాట్లాడిన వారు సన్నిహితులు చెబుతుంటారు. రీసెంట్ గా బాలయ్య అఖండ‌ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం బాలయ్య రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాల‌కు సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే బాలయ్యపై ఇండస్ట్రీలో ఎలాంటి పుకార్లు లేవన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లతో ప్రేమాయణం ఇతర పుకార్లు బాలయ్యపై ఎప్పుడు రాలేదు.

 

Advertisement

కానీ ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కొన్ని ఇంటర్వ్యూల‌లో బాలయ్య మ‌ద్రాస్ హీరోయిన్ ను ప్రేమించార‌ని చెప్పారు. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలిసిన వెంటనే ఓ సంబంధం చూడాలని తనకు సూచించినట్లు చెప్పారు. దాంతో తాను తన బంధువుల అమ్మాయి అయిన వసుంధర దేవిని చూపించినట్టు తెలిపారు. అనంతరం బాలయ్యకు వివాహం జరిగినట్లు తెలిపారు. అయితే మద్రాస్ హీరోయిన్ పేరు మాత్రం నాదెండ్ల భాస్కరరావు ఎప్పుడు బయట పెట్టలేదు.

Advertisement

Balayya

Balayya

అంతేకాకుండా బిగ్ బాస్ బ్యూటీ ఆర్జీవి సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ రాపాక కూడా బాల‌య్య‌కు ల‌వ్ స్టోరీ ఉందని బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ఇంటర్వ్యూ లో శ్రీరాపాక మాట్లాడుతూ… బాలయ్య హీరోగా నటించిన ఓ సినిమాకు తాను కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశానని తెలిపింది, సినిమా షూటింగ్ సమయంలో బాల‌య్య త‌న ప్రేమ కథ చెప్పాడని తెలిపింది.

బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని ఆయన చాలా జోవియల్ గా ఉంటారని తెలిపింది. ఓ సమయంలో తాను హీరోయిన్ ను ప్రేమించినట్టు బాలయ్య చెప్పారని తెలిపింది. కానీ తన తండ్రి ఎన్టీ రామారావు, అన్న‌ హరికృష్ణకు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని అందువల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని చెప్పినట్టు తెలిపింది. ఇక బాలయ్య మరియు అప్పటి సార్ హీరోయిన్ ఖుష్బూ ప్రేమలో ఉండే వారిని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. దాంతో ఆ మద్రాస్ హీరోయిన్ ఖుష్బూనే బాల‌య్య ప్రేమించి ఉంటార‌ని టాక్.

Visitors Are Also Reading