Home » మిథాలీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలుసా..?

మిథాలీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తెలుసా..?

by Azhar
Ad

భారత మహిళా క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ నిన్న తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం అందరికి తెలిసిందే. అయితే తన 16 ఏళ్ళ వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన సానియా 39 ఏళ్ళ వయసులో రిటర్మెంట్ ఇచ్చింది. అయితే తన 23 ఏళ్ళ సుదీర్ఘ కెరియర్ లో ఎన్నో రికార్డులు సాధించిన మిథాలీ రాజ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దాంతో ఆమె అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు అభిమానులు.

Advertisement

అయితే మిథాలీ 16 ఏళ్ళ వయస్సులో క్రికెట్ మోడీజేలు పెట్టగ.. ఆమెకు 22 రెండు ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. కానీ అప్పుడు క్రికెట్ పైనే మొత్తం ఫోకస్ పెట్టిన మిథాలీ పెళ్లికి నో చెప్పింది. ఆ తర్వాత 27 ఏళ్ళు దాటినా తర్వాత మిథాలీ పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ వచ్చిన సంబంధాల వారు పెళ్లి తర్వాత క్రికెట్ వదిలేయాలని సూచించారు. దాంతో క్రికెట్ ను వదిలిపెట్టలేక పెళ్లి ఆలోచనను వదిలేసింది.

Advertisement

ఇక అప్పటి నుండి పెళ్లి గురించి వదిలేసింది మిథాలీ. కాకపోతే ఈ మధ్యే ఓ సారి తనకు పెళ్లి గురించి ప్రశ్నించగా… నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వారిని చూసి ఇలా ఒంటరిగా ఉండటమే మంచిది అని నిర్ణయిచుకున్నాను అని తెలిపింది. అయితే మిథాలీ ఆ మధ్య ఓ భారత క్రికెటర్ తో ప్రేంలో ఉన్నట్లు.. వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని తెలిసింది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి పొగరు ఎక్కువ అని చెబుతున్న పాక్ ఆటగాళ్లు..!

మిథాలీ రాజ్ టాప్ రికార్డ్స్ ఇవే…!

Visitors Are Also Reading