Home » ఆ ఊరి రైల్వే స్టేషన్ లో టికెట్లు కొంటారు.. కానీ ట్రైన్ ఎక్కరు.. ఎందుకో తెలుసా..?

ఆ ఊరి రైల్వే స్టేషన్ లో టికెట్లు కొంటారు.. కానీ ట్రైన్ ఎక్కరు.. ఎందుకో తెలుసా..?

by Sravya
Ad

సాధారణంగా ఎక్కువ మంది ట్రైన్ లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి రైలులో ప్రయాణం చేయడం వలన ఎంతో ఈజీగా ఉంటుంది సౌకర్యంగా మనం రైలు లో ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్లాలన్నా కూడా రైలు మార్గం బాగుంటుంది. బస్సు లేదా ట్రైన్లు కానీ ఇతని ఇతర మార్గంలో వెళ్లాలంటే కచ్చితంగా టికెట్ కొనాలి. టికెట్ తీసుకోకపోతే ప్రయాణం చేయడానికి అనుమతించరు. అయితే టికెట్ కొన్న తర్వాత మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా కారణాల వలన లేట్ అయ్యి ట్రైన్ లేదా బస్సు మిస్ అవ్వడం వలన ప్రయాణం చేయడం కుదరకపోవచ్చు. ఒక ప్రాంతంలో ప్రతిరోజు విరాళాలు సేకరించి 60 కి పైగా ట్రైన్ టికెట్లు కొంటారు. అయితే వారు ఎక్కడికి ప్రయాణం చేయరు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.

Advertisement

Advertisement

టికెట్స్ కొని ఎందుకు ప్రయాణం చేయరు అనే సందేహం మీకు కూడా రావచ్చు. తమ ఊరి ట్రైన్ హాల్టింగ్ ఎక్కడ రద్దు అవుతుందో అన్న భయంతో ఆ ఊరి ప్రజలు రైలు టికెట్ కొంటున్నారు. నర్సంపేట నియోజకవర్గానికి ఒకే రైల్వే స్టేషన్ వుంది. అదే నెక్కొండ రైల్వే స్టేషన్. ఆ నియోజకవర్గంలో కొన్ని మండలాలకు చెందిన ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా నెక్కొండ రైల్వే స్టేషన్ కి వస్తూ ఉంటారు. హైదరాబాద్ ఢిల్లీ తిరుపతి షిరిడి ఇలా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ స్టేషన్లో అనేక రైళ్ల హాల్టింగ్ లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు.

ఆదాయం అంతగా లేదని వంకతో రైల్వే ఆఫీసర్లు పద్మావతి ఎక్స్ప్రెస్ ని నెక్కొండ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ రద్దు చేశారు రీసెంట్గా సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కి టెంపరరీ హాల్టింగ్ ఇచ్చారు. కానీ రైల్వే అధికారులు స్థానిక ప్రజలకి ఒక షరతు కూడా పెట్టారు. మూడు నెలలు అక్కడి నుండి ఆదాయం వస్తే పూర్తిస్థాయిలో ట్రైన్ హాల్టింగ్ ఇస్తామని, ఆదాయం లేకపోతే క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. దీంతో అక్కడ ఊరి ప్రజలు విరాళాల రూపంలో 25 వేల రూపాయలు ఇప్పటిదాకా సమకూర్చారు. డబ్బులు పెట్టి ప్రతిరోజు నెక్కొండ నుండి ఖమ్మం సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకి ట్రైన్ టికెట్స్ కొంటూ ఉంటారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading