Home » మంకీపాక్స్ నివార‌ణ‌కు డ‌బ్ల్యూహెచ్ఓ పంచ సూత్రాలు ఇవే..!

మంకీపాక్స్ నివార‌ణ‌కు డ‌బ్ల్యూహెచ్ఓ పంచ సూత్రాలు ఇవే..!

by Anji
Ad

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్న త‌రుణంలో ఇప్పుడు ప‌లు దేశాల్లో మంకీపాక్స్ బెంబేలెత్తిస్తుంది. రోజురోజుకు కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. డ‌బ్ల్యూహెచ్ఓ తాజాగా మ‌రొక సారి ఆందోళ‌ణ వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 27 దేశాల్లో 780 కేసులు వెలుగులోకి వ‌చ్చిన త‌రుణంలో వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. డ‌బ్ల్యూహెచ్ఓ అధికారిని మ‌రియా వాన్ కెర్‌ఖోవ్ ఈ విష‌యం పై మాట్లాడారు. అస‌లు మంకీపాక్స్ అంటే ఏమిటి..? నివార‌ణ చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై పెంచాల‌ని, ఆ దిశ‌గా అయిదు నివార‌ణ చ‌ర్య‌ల‌ను ప్ర‌తిపాదించారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వైర‌స్‌, టెస్టింగ్‌పై అవ‌గాహ‌న

ముఖ్యంగా మంకీ పాక్స్ అంటే ఏమిటి..? అది ఏలా వ్యాప్తి చెందుతుంది. అనే అంశాల‌పై వైద్యారోగ్య శాఖ సిబ్బంది, పౌరుల్లో అవ‌గాహ‌న పెంచాలి. దీంతో పాటు నిఘా వ్య‌వ‌స్థ‌ను కూడా ప‌టిష్టం చేయాలి. ముఖ్యంగా మంకీపాక్స్ గురించి అవ‌గాహ‌న లేని దేశాల‌లో స్థానిక వైద్య వ్య‌వ‌స్థ‌లు దీనిని స‌కాలంలో గుర్తించే విధంగా స‌రైన చికిత్స అందించేవిధంగా అవ‌స‌రం.

మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ్యాప్తి నిరోధించ‌డం

నాన్ ఎండెమిక్ దేశాల‌లో దీనిని చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మ‌నం వైద్య స‌దుపాయాల సహాయంతో వైర‌స్‌ను ముందుగా గుర్తించ‌గ‌లిగే స్థితిలో ఉన్నాం. ఈ త‌రుణంలో అనుమానితుల‌తో పాటు వారిని క‌లిసిన వారిని ఐసోలేష‌న్ చేయ‌డం వంటి చ‌ర్య‌లు చాలా కీల‌కం. స్థానిక ప్ర‌జ‌ల‌తో మాట్లాడ‌టం.. వారిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కీల‌కం.

Advertisement

ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్‌కు ర‌క్ష‌ణ

అనుమానితుల నుండి న‌మూనాలు సేక‌రించే వారు, ప‌రీక్ష‌లు చేసేవారు, సేవ‌లందించేవారు ముందుగా ఈ వైర‌స్‌పై త‌గిన స‌మాచారం క‌లిగి ఉంటే బెట‌ర్‌. అందుకు తగ్గ‌ట్టు ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు కూడా తీసుకోవాలి.

వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల అమ‌లు

ఈ వైర‌ల్ వ్యాధి చికిత్స కోసం అవ‌స‌ర‌మైన అన్ని ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభించాలి. దీనికోసం కొన్ని యాంటివైర‌ల్స్‌, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వినియోగం విష‌యం మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

మంకీపాక్స్ పై ప‌రిశోధ‌న‌లు ముమ్మ‌రం చేయ‌డం

వైర‌స్ గురించి పూర్తి స‌మాచారాన్ని విశ్లేష‌ణ చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే అంటువ్యాధుల‌కు సంబంధించిన అంత‌ర్జాతీయ నిపుణులు, ప‌రిశోధ‌న సంస్థ‌ల‌తో త్వ‌ర‌లోనే ఓ స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌క‌టించింది.

Also Read : 

ఆ ఊరిలో సెల్‌ఫోన్, టీవీ, రేడియో నిషేదం.. ఎందుకో తెలుసా..?

విరాటపర్వం ట్రైలర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

 

Visitors Are Also Reading