Home » త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క…వరుడు ఎవరంటే…?

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క…వరుడు ఎవరంటే…?

by AJAY
Ad

టాలీవుడ్ ఎక్కువ కాలం హీరోయిన్ గా రాణించిన వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సూపర్ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్ లను అందుకుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరి తోను అనుష్క జోడీ కట్టింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల తో కూడా అనుష్క తన టాలెంట్ ను నిరూపించుకుంది.

Advertisement

Advertisement

ఇక చివరగా అనుష్క నిశబ్దం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత అనుష్క మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే అనుష్క కు సీనియర్ హీరోల పక్క వరుస ఆఫర్ లు వచ్చినా రిజెక్ట్ చేస్తున్నట్టు సమాచారం.

ఇప్పటి వరకు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మాత్రమే అనుష్క ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఇదిలా ఉంటే అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బెంగుళూరు వ్యాపారవేత్త తో అనుష్క పెళ్లి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading