2021 సంవత్సరం చిత్ర పరిశ్రమకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఏడాది చాలా మంది ప్రముఖ నటులు మరియు నిర్మాతలు చాలా మంది మృతి చెందారు. అయితే వీరిలో కొంత మంది గురించి తెలుసుకుందాం.
ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59). ఏప్రిల్ 17వ తేదీన గుండెపోటుతో చెన్నై ఆస్పత్రిలో మరణించారు. కె.బాలచందర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా మరియు స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన ఆయన తర్వాత నటుడిగా మారారు. 300కు పైగా సినిమాలలో నటించిన ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది.
Advertisement
ప్రముఖ దర్శక నిర్మాత నటుడు స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు రాజీవ్ కపూర్ 58 సంవత్సరాల ఈ వయసులోనే కన్నుమూశారు. రాజకుమారి ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన గుండెపోటు కారణంగా మరణించారు. హీరోగా.. రామ్ తేరీ గంగా మైలీ తో గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కపూర్ ప్రేమ్ బంద్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
Advertisement
ఈ సంవత్సరం నవంబర్ 29వ తేదీన పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. 1985 సంవత్సరంలో సిరివెన్నెల తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన… తుది శ్వాస విడిచే వరకూ పాటలు రాస్తూనే ఉన్నారు. ఇంకా కొన్ని చిత్రాలలో అతిథి పాత్రను కూడా పోషించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.
నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు మరియు జాతీయ అవార్డు గ్రహీత శివ శంకర్ మాస్టర్ (72) మరణించారు. 2013 సంవత్సరంలో వచ్చిన బాహుబలి సినిమా ఆయన చివరిది. శివ శంకర్ మాస్టర్ పలు సినిమాల్లో నటించారు.
అక్టోబర్ 29వ తేదీన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో మృతి చెందారు. 44 సంవత్సరాలు ఉన్న పునీత్ మృతి.. చిత్ర పరిశ్రమకు తీరని నిరాశను మిగిల్చింది. బాల నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పునీత్ కన్నడ చిత్ర పరిశ్రమ పవర్‌స్టార్ అనిపించుకునేది.