Home » ఒమిక్రాన్ వచ్చిన ఇద్దరి లక్షణాలు చెప్పిన కేంద్రం…అంత ప్రమాదకరమా…?

ఒమిక్రాన్ వచ్చిన ఇద్దరి లక్షణాలు చెప్పిన కేంద్రం…అంత ప్రమాదకరమా…?

by AJAY
Ad

కరోనా విషయంలో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన మరో వేరియంట్ వల్ల ప్రమాదం పొంచి ఉందని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ విషయంపై కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బెంగళూరులో ఒమిక్రాన్ వేరియంట్ తో రెండు కేసులు నమోదయ్యాయి. వారిలో ఓ వ్యక్తి సౌత్ ఆఫ్రికా నుండి రాగా మరో వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.

Omicron veriant

Omicron veriant

ప్రస్తుతం ఆ ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. అయితే ఇద్దరి లోనూ తీవ్ర లక్షణాలు లేవని స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతే కాకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ తీవ్ర లక్షణాలు లేవని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ ను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా 37 ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. విదేశాల నుండి వచ్చే ప్రతి ఒక్కరికీ కూడా ఆర్టిపిసిఆర్ టెస్ట్ లు తప్పనిసరి అని ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

Advertisement

Advertisement

తెలంగాణలో తొలి ఒమిక్రాన్ కేసు….!

ఇక కేంద్రం చెప్పిన వివరాలను ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మాస్కులు ధరించడం, శానిటైజర్ లు వాడటం, సామాజిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే మహమ్మారి బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అలర్ట్ అయ్యాయి. కరోనా నిబంధనలు మళ్లీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. అంతే కాకుండా వ్యాక్సినేషన్ ను పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యాయి.

Visitors Are Also Reading