తమిళ నాడులోని నీలగిరి కనుమల్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈఘోర ప్రమాదంలో… బిపిన్ రావత్ దంపతులతో కలిపి.. 13 మంది మరణించారు. అయితే.. వీరిలో ఏపీకి చెందిన జవాన్ కూడా ఉన్నారు. ఈ జవాన్ చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ్ గా ఆర్మీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సాయితేజ్ బిపిన్ రావత్ కు సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేస్తున్నట్లు గా తెలుస్తోంది.
Advertisement
Advertisement
సాయితేజ్ మృతితో ఎగువరేగడి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య శ్యామలతో చివరిసారిగా బుధవారం ఉదయం 8.30 గంటలకు ఫోన్ లో సాయితేజ మాట్లాడారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఆయన కుటుంబం మదన పల్లెలో ఉంటుంది.
సాయితేజ ఈ రోజు ఉదయం వెల్లింగ్టన్ కు బయలు దేరేముందు.. వీడియో కాల్ చేసి భార్య, పిల్లలతో మాట్లాడారు. ఆ తర్వాత.. కాసేపటికే జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో.. మృతి చెందారు. సాయితేజ మృతి తో ఆయన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయితేజ మృతి పట్ల జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. బిపిన్ రావత్ అంత్యక్రియలు ఢిల్లీ లో రేపు జరుగనున్నాయి.