Home » ఈ చలి కాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి

ఈ చలి కాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి

by Bunty
Ad

ఇతర కాలాలతో పోల్చితే చలి కాలంలో కొందరు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వలన కూడా కొంత ప్రభావం పడే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే పెద్దలు సూచిస్తున్న ఈ టిప్స్ ఫాలో అయితే కనుక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ సీడ్స్ ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులను నోట్లో వేసుకొని నమలడం ద్వారా మీ అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కోల్డ్ లు నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి లీవ్స్ వాటర్ తీసుకున్నా చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. గొంతులో గరగర కూడా తొలగిపోతుంది.

Advertisement

ప్రతి నైట్ టైం లో తులసి ఆకులను నీటిలో నానబెట్టుకోవాలి. అలా తులసి ఆకులు ఉన్న వాటర్ ను ప్రతి రోజూ పరగడుపున తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. ఇకపోతే అల్లం తీసుకోవడం వల్ల కూడా చలికాలంలోనే కాదు.. ఇతర కాలాల్లోనూ మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం గుణాలతో ఇమ్యూనిటీపవర్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటు జలుబు, ఇతర రకాల వైరస్లో దరిచేరవు. గొంతు నొప్పితో బాధపడేవారికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. జలుబు, కఫం సమస్యలు పరిష్కరించుకునే అందుకుగాను వాముపొడి వాడాలి. అరలీటరు తాగునీటిలో వాము పొడి, పసుపు వేయాలి.

Advertisement

ఇవి వేసే ముందర వాటర్ ను వేడి చేయాలి. అవి చల్లారిన తర్వాత తేనెలో కలుపుకొని తాగితే కపం, జలుబు దగ్గు తగ్గిపోతుంది. బాగా దంచి నా తర్వాత వామును మజ్జిగలో కలుపుకుని తాగినా చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా చేయడం వుపిరితిత్తుల కు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రా పాలలో కొంచెం పసుపు కలిపి తీసుకుంటే చాలా మంచిది. అలా చేయడం ద్వారా జలుబు దగ్గు సమస్యలు పరిష్కారమవుతాయి. పసుపు పాలల్లో చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. పాపం సమస్య ఉన్నవారిలో పసుపు పాలు తాగితే తొందరగా సమస్య పరిష్కారమవుతుంది. ఇకపోతే కర్పూరాన్ని నువ్వుల నూనెలో కరిగించి దాన్ని తో మసాజ్ చేసుకున్నట్లయితే ప్రయోజనాలుంటాయి. నల్ల మిరియాల కషాయం కూడా ఒకటి చక్కటి ఔషధం. దగ్గు, జలుబు ఈ కషాయం తాగితే చాలా తొందరగా తగ్గిపోతాయి.

Visitors Are Also Reading