Home » ఎండాకాలంలో కూల్ వాటర్ తాగేస్తున్నారా…? అయితే ఈ విషయాలను తెలుసుకోండి

ఎండాకాలంలో కూల్ వాటర్ తాగేస్తున్నారా…? అయితే ఈ విషయాలను తెలుసుకోండి

by Bunty
Ad

వేసవి వచ్చేసింది. తనతో పాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట తీసుకొస్తుంది. వీటి వల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెల ఆస్వాదించొచ్చు. అయితే,ఈ వేసవికాలంలో కూల్ చల్లని నీళ్లు, చల్లని పానీయాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

జీర్ణక్రియపై ప్రభావం : వేసవి ఎండలలో కూల్ వాటర్ తాగడం వల్ల ప్రధానంగా జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతుందని అంటున్నారు నిపుణులు.

Advertisement

 

శ్వేధ రంధ్రాలు మూసుకుపోవడం : వేసవికాలంలో చాలామంది బయట నుంచి ఇంటికి వచ్చాక వెంటనే కూల్ వాటర్ తో ముఖం, శరీరం కడుక్కుంటారు. అయితే ఇలా చేయడం మరింత ప్రమాదకరమట. చన్నీటితో శరీరం చర్మాన్ని కడిగితే… దానిపై ఉండే శ్వేధ రంధ్రాలు మూసుకుపోతాయని వివరిస్తున్నారు నిపుణులు.

 

హృదయ స్పందన రేటు : వేసవిలో కూల్ వాటర్ తాగడం వల్ల హార్ట్ బీటింగ్ రేట్ తగ్గిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

 

తలనొప్పి : కూల్ వాటర్ తాగడం వల్ల వెన్నెముకలోని సెన్సిటివ్ నరాలు ప్రభావితమై తలనొప్పికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చల్లని నీటి కారణంగా ముఖం, కపాల కండరాలు జివ్వుమని లాగి… తీవ్రమైన నొప్పి వస్తుంది.

Visitors Are Also Reading