తెలంగాణలో బతుకమ్మ పండుగని ఎంతో ఘనంగా జరుపుతారు. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న బతుకమ్మ పండుగ, ప్రకృతికి పట్టాభిషేకం చేయడం చెప్పుకోదగ్గవి. తొమ్మిది రోజులు కూడా పూల దేవతని కీర్తిస్తూ పాటలు పాడుతూ మహిళలు ఎంతో ఘనంగా జరుపుతారు బతుకమ్మ పండుగని. అయితే బతుకమ్మ పండుగని జరపడం వలన మహిళల ఆరోగ్యం కూడా బాగుంటుందట. మరి బతుకమ్మ పండుగ చేసి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు అనేది తెలుసుకుందాం. మహిళలు బతుకమ్మ పండుగ ని చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. పైగా బతుకమ్మ పండుగని జరిపినప్పుడు మహిళలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు.
Advertisement
Advertisement
ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంటారు కాబట్టి ఆరోగ్య ప్రయోజనాలు ఇలా కూడా పొందుతారు. బతుకమ్మ పండుగ చేసినప్పుడు చప్పట్లు కొడుతూ, పాదాలతో లయబద్ధంగా ఆడుతూ ఉంటారు. దీంతో చిన్నపాటి వ్యాయామం అయినట్లు ఉంటుంది. బతుకమ్మ ఉత్సవంలో ఇలా ఆడుతూ పాడుతూ ఉండడం వలన రక్త ప్రసరణ బాగుంటుంది. పసుపు గౌరమ్మ అని పవిత్రంగా పసుపుని రాసుకోవడం, పసుపు ముద్దని మింగడం ఇటువంటివన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పువ్వులు వాసనని పీల్చుకోవడం వలన ఆక్సిజన్ తీసుకోవడం పెరుగుతుంది. నిద్రలేమి, నడుం నొప్పి, అలసట ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
Also read:
- చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్తగా వుండండి.. లేదంటే అనందం అస్సలు ఉండదు..!
- చల్లటి నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు చూసుకోండి..!
- యవ్వనంగా కనపడాలని అనుకుంటున్నారా..? ఈ ఆహారపదార్దాలని తప్పక తీసుకోండి..!