పచ్చ కర్పూరం తో ఆరోగ్య ప్రయోజనాలని కూడా పొందవచ్చు. కర్పూరంలో 15 రకాలు ఉంటాయి. అయితే పచ్చ కర్పూరం చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో పచ్చ కర్పూరానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. ప్రసాదాలు, స్వీట్స్ వంటి వాటి లో కూడా పచ్చ కర్పూరంని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పచ్చ కర్పూరం మచ్చలు మొటిమల్ని కూడా తొలగించగలదు.
Advertisement
Advertisement
ఒక చెంచా నిమ్మరసంలో కొంచెం పచ్చ కర్పూరం కలిపి మచ్చలు ఉన్నచోట రాసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది. స్నానం చేసే నీటిలో, కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి. పచ్చ కర్పూరాన్ని ఒక కప్పు నీటిలో వేసి మంచం కింద పెడితే దోమలు రావు. ఉబ్బసంతో బాధపడే వాళ్ళు పచ్చ కర్పూరంని బెల్లాన్ని కలిపి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. పొడిబారిన పగిలిన పాదాలకి కొబ్బరి నూనెలో కర్పూరం వేసి మర్దన చేస్తే ఈ సమస్యల నుండి బయట పడొచ్చు ఇలా పచ్చ కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు.
Also read:
- బియ్యం కడిగిన నీళ్లతో.. ఇలా మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి…!
- మానసిక ప్రశాంతత ని పొందాలని చూస్తున్నారా..? అయితే ఇవి తప్పక పాటించండి..!
- ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోండి.. ఎముకల్ని బలంగా మార్చేసుకోవచ్చు…!